ప్రపంచ క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెలియని వారు ఉండరు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎన్నో ఏళ్ల పాటు ఇండియా కు ఎనలేని సేవలు చేసిన విషయం తెలిసిందే. క్రికెట్ కే వన్నెతెచ్చిన ఆటగాడిగా సచిన్ పేరు నిలిచిపోయింది. తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే పరుగుల వరద పారుతు  ఉంటుంది. తనదైన బాటిల్ తో బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు సచిన్ టెండూల్కర్. అయితే ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో కార్చిచ్చు తో అడవి మొత్తం అగ్నికి ఆహుతి అవ్వగా ఎంతో మంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక మూగజీవాల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేనిది. కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 

 


 ఈ నేపథ్యంలో కారుచిచ్చు బాధితుల కోసం క్రికెట్ మ్యాచ్ లు  నిర్వహించగా... సచిన్ కూడా ఆ మైదానంలో తళుక్కుమన్నారు. మెల్బోర్న్లో గిల్క్రిస్ట్ ఎలెవన్ పాంటింగ్ ఎలెవన్ జట్ల  మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చినప్పుడు సచిన్ బ్యాటు పట్టి  మైదానంలోకి దిగి తమ బ్యాటింగ్తో క్రికెట్ ప్రేక్షకులను అలరించాడు. ఆసిస్ ట్రేడ్మార్క్  యూనిఫాంలో ఎల్లో డ్రెస్ లో వచ్చిన సచిన్ మహిళా బౌలర్ ఎలిస్ పెర్రీ  బౌలింగ్ లో తన కళాత్మక ప్రదర్శించాడు. టీమిండియాలో అద్భుత ఫామ్ను కొనసాగించి ఈ సమయంలో... బంతిని ఎంత సులువుగా కొట్టేవాడు ప్రస్తుతం అంతే టైమింగ్ తో ఈజీగా బంతిని బ్యాట్ కు  తాకిస్తూ తనదైన ఆట  ప్రదర్శించాడు సచిన్ టెండూల్కర్. చాలా ఏళ్ల తర్వాత మైదానంలో సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టడంతో  అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 

 


 ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్  ద్వారా మొన్నటి వరకు కార్చిచ్చు  ద్వారా ఏర్పడిన భారీ నష్టానికి నష్టపరిహారం అందించేందుకు అన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో వేడిగాలులు ఎక్కువగా వీయడంవల్ల అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు  కాస్త  ఎన్నో అడవులను దహించుకు పోయింది . అడవుల్లో సంచరిస్తున్న ఎన్నో జంతువులు ఈ అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూగ  జంతువుల మరణాలు కూడా ఎంతో మందిని కలిచి వేసింది. కాగా ఎన్నో రోజుల పాటు కార్చిచ్చు... అడవులను దహించి  అడవి జంతువుల ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: