టీమిండియా యువ ఆటగాళ్లు తమకు తిరుగులేదని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఓవైపు టీమిండియా వరుస సిరీస్లలో గెలుచుకుంటూ అద్భుత ఫామ్ తో  దూసుకుపోతుంటే... అటు టీమిండియా యువ కెరటాలు కూడా తమదైన స్టైల్లో విజయాన్ని సాధిస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఫైనల్ వరకు చేరుకున్నారు. ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా జట్టు ఫైనల్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అన్ని జట్టును చిత్తు చేస్తూ ఫైనల్కు చేరుకుంది టీమిండియా జట్టు. ఇక టీమిండియా యువ కెరటాలు తమదైన శైలిలో అద్భుతంగా రాణిస్తూ ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. కాగా ఈ రోజు అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతుంది. 

 


 బంగ్లాదేశ్ టీమిండియా మధ్య ఈ ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. కాక అండర్-19 ఫైనల్ పోరుకు ఆతిథ్యమిస్తున్న సెన్వెస్  పార్క్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలమైనది. ఇదే గ్రౌండ్ లో సెమీ ఫైనల్స్లో భారత బ్యాట్స్మెన్లు అందరూ అద్భుత ప్రదర్శన చేశారు. ఏకంగా సెంచరీలు కూడా బాది  ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు భారత అండర్-19 ఆటగాళ్ళు. ప్రస్తుతం ఇదే గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ వచ్చింది  భారత్. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్లో దూకుడుగా ఆడిన భారత అండర్-19 ఆటగాళ్ళందరూ ప్రస్తుతం పరుగులు తీసేందుకు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్కోర్ బోర్డ్ కాస్త నత్తనడకన నడుస్తోంది. 

 

 అయితే గత మూడు మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఈ మైదానంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కాగా  ప్రస్తుతం యువ ఆటగాళ్లు కూడా ఆచితూచి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు బంగ్లాదేశ్ బౌలింగ్ కూడా బలంగా ఉండడంతో టీమిండియా ఆటగాళ్లకు బ్యాటింగ్ మరింత క్లిష్టంగా మారిపోయింది. కళ్ళు చెదిరే బంతులతో టీమిండియాను బెంబేలెత్తుస్తున్నారు బంగ్లాదేశ్ బౌలర్లు. ఈ నేపథ్యంలో కనీసం పరుగులు తీయడానికి కూడా వీలులేకుండా బాల్ విసురుతున్నారు . ఈ క్రమంలోనే జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఓపెనర్  దివ్యాన్క్  సక్సేనా 2 పరుగులతో పెవిలియన్  బాట పట్టాడు. ప్రస్తుతం భారత జట్టు  ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత యువ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: