పాకిస్థాన్ యువ పాస్ట్ బౌలర్ నసీమ్ షా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. రావల్పిండి లో ప్రస్తుతం  పాక్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో భాగంగా  నసీమ్ షా హ్యాట్రిక్ వికెట్ల ను సాధించాడు. 41ఓవర్ లో నాల్గో బంతికి శాంటో ను ఎల్బీ రూపం లో అవుట్ చేసిన  నసీమ్ షా అదే ఓవర్ లో మిగితా రెండు బంతుల్లో తైజుల్ ఇస్లామ్ ,మహమ్మదుల్లా లను వెనక్కు పంపి టెస్టు కెరీర్ లో మొదటి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు అంతేకాదు టెస్టు క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ ను సాధించిన  అత్యంత పిన్న వయస్కుడిగా నసీమ్  షా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నసీమ్ షా వయసు 16సంవత్సరాలు.  కాగా పాకిస్థాన్  తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన నాల్గో బౌలర్ కూడా నసీమ్ షానే కావడం విశేషం. ఇంతకుముందు వసీమ్ అక్రమ్ , రజాక్ ,సమీ ఈఘనత సాధించారు. 
 
 
ఇక  బంగ్లాదేశ్ మొదటి టెస్టు లో ఓటమి అంచున నిలిచింది. మొదటి ఇన్నింగ్స్ లో పాక్ 445పరుగులు చేయగా బంగ్లాదేశ్ 233పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బంగ్లా  ప్రస్తుతం 6వికెట్ల నష్టానికి 126పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే బంగ్లా ఇంకా 86పరుగులు చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: