టీమ్ ఇండియా ఏ మ్యాచ్ విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లల్లో  ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. కొంతకాలం నుంచి కెరీర్లోనే బెస్ట్ ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. ఇండియాలో ఉన్న టెక్నికల్ బ్యాట్స్మెన్లలో ఒక్కడైనా కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం ఓ వైపు కీపర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు... జట్టులో కీలక బ్యాట్ మెన్ గా  కూడా అదరగొడుతున్నాడు. ఫార్మెట్ ఏదైనా తనదైన కళాత్మకమైన ఇన్నింగ్స్తో భారీ స్కోరు నమోదు చేసి రికార్డులు సృష్టిస్తున్నాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం టీమిండియా లో కీలక ప్లేయర్ గా మారిపోయి ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నాడు. 

 

 

 ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో  ఉన్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రాహుల్ విదేశీ గడ్డపై కూడా తన సత్తా చాటుతూ శివమెత్తుతున్నాడు. భారీ స్కోరు నమోదు చేస్తూ టీమిండియా విజయంలో కీలకంగా మారిపోయాడు. అయితే మొన్నటికి మొన్న న్యూజిలాండ్ టీమిండియా మధ్య టి20 సిరీస్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ ను  క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయంలో కీలకంగా మారిన కె.ఎల్.రాహుల్  ఏకంగా 224 పరుగులు చేసి టి20 సిరీస్ లో అత్యధిక చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు మరో రికార్డును సృష్టించాడు కె.ఎల్.రాహుల్. 

 

 

 అయితే న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రాహుల్ కొన్ని పరుగులకే వెనుదిరిగిన  విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా భారీ స్కోరు నమోదు చేయాలని రంగం లోకి  దిగిన రాహుల్ వేగంగా సెంచరీ సాధించాడు. 112 పరుగులు పరుగులు సాధించి ఎన్నో రికార్డులను తిరగరాశాడు కె.ఎల్.రాహుల్. టీమిండియా కష్టకాలంలో ఉన్న సమయంలో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమిండియాకు భారీ స్కోర్ అందించాడు. ఏకంగా 5వ స్థానంలో వచ్చి సెంచరీ సాధించడంతో ప్రస్తుతం రాహుల్ ఇన్నింగ్స్  పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే 5వ స్థానంలో న్యూజిలాండ్పై సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లలో రైనా  అయిన తర్వాత రాహుల్ రికార్డు సృష్టించాడు. కాగా సురేష్ రైనా 2015 సంవత్సరంలో కివీస్ తో ఆడిన వన్డే మ్యాచ్లో సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: