ప్రత్యర్థి జట్టు అన్నింటినీ ఓడిస్తూ... వరుస సిరీస్లను  గెలుచుకుంటూ... విజయోత్సాహంలో ముందుకు సాగుతుంది టీమిండియా. మునుపెన్నడూ లేనివిధంగా జట్టు ఎంతో పటిష్టంగా మారింది.అయితే  మొన్నటివరకు ప్రత్యర్థి జట్టులు  అన్నింటినీ చిత్తుగా ఓడిస్తు  వరుస సిరీస్ లు  గెలుచుకున్న టీమ్  ఇండియాకు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కష్ట పరిస్థితులు వచ్చాయి. మొన్నటికి మొన్న న్యూజిలాండ్ తో ఆడిన టి20 మ్యాచ్ లో  వరుసగా ఐదు మ్యాచుల గెలిచి న్యూజిలాండ్ జట్టును స్వదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... తర్వాత జరిగిన వన్డే సిరీస్లో మాత్రం కష్టకాలంలో పడింది. వరుసగా రెండు వన్డే మ్యాచ్ల్లో ఓడి న్యూజిలాండ్ కు సిరీస్ ను కట్టబెట్టింది. అయితే కనీసం మూడో వన్డే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బరిలోకి దిగింది టీమిండియా. న్యూజిలాండ్ మాత్రం టి20 క్లీన్ స్వీప్ చేసిన ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగింది. అయితే మూడో వన్డేలోనూ టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డారు. 

 

 

 ఓపెనర్గా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశ పరిచాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోహ్లీ కూడా అతి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇక అయ్యర్  అవుట్ అయిన తర్వాత కూడా కీపర్ కె.ఎల్.రాహుల్ తనదైన కళాత్మక ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరును నమోదు చేశాడు. ఏకంగా మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ సాధించాడు కేఎల్ రాహుల్. 112 బంతుల్లో 113 రన్స్ చేశాడు.. సిక్సులు  ఫోర్ ల తో అదరగొట్టేశాడు. ఈ నేపథ్యంలో రికార్డుల మోత మోగించాడు కళాత్మకమైన బ్యాట్మెన్  కేఎల్ రాహుల్. 

 

 

 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేలో సెంచరీ సాధించిన వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. 1999 ఇంగ్లాండు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో క్రికెట్  దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సెంచరీ సాధించాడు. ఇదొక్కటే కాదు  రాహుల్ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐదు లేదా ఆ తర్వాత స్థానంలో బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించిన వికెట్ కీపర్గా ధోనీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు . 2017 ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ధోని  134 పరుగులు చేశాడు. అంతే కాదు భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్లో నాలుగు సెంచరీలు సాధించిన రికార్డును రాహుల్ నమోదు చేశాడు. అంతకు ముందుగా శిఖర్ ధావన్ 24 ఇన్నింగ్స్ లో  4 సెంచరీలు సాధించిన ఘనత సాధించగా..  వరుసగా లోకేష్ రాహుల్  31, విరాట్ కోహ్లీ 36, గౌతం గంభీర్ 44, వీరేంద్ర సెవాగ్ 58 ఇన్నింగ్స్ లలో  సెంచరీలు సాధించారు. కెరియర్ లోనే బెస్ట్ ఫామ్లో ఉన్న కె.ఎల్.రాహుల్ కొంతకాలంగా తనదైన కళాత్మక ఇన్నింగ్స్ ఆడుతున్న  విషయం తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ ఇన్నింగ్స్ పై  ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: