టీమిండియా ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు ప్రత్యర్థి జట్టులు  అన్నింటినీ చిత్తుగా ఓడిస్తు  వరుస సిరీస్ లు  గెలుచుకున్న టీమ్  ఇండియాకు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా కష్ట పరిస్థితులు వచ్చాయి. మొన్నటికి మొన్న న్యూజిలాండ్ తో ఆడిన టి20 మ్యాచ్ లో  వరుసగా ఐదు మ్యాచుల గెలిచి న్యూజిలాండ్ జట్టును స్వదేశంలోనే క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా... తర్వాత జరిగిన వన్డే సిరీస్లో మాత్రం కష్టకాలంలో పడింది. వరుసగా రెండు వన్డే మ్యాచ్ల్లో ఓడి న్యూజిలాండ్ కు సిరీస్ ను కట్టబెట్టింది. అయితే కనీసం మూడో వన్డే గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బరిలోకి దిగింది టీమిండియా. న్యూజిలాండ్ మాత్రం టి20 క్లీన్ స్వీప్ చేసిన ప్రతీకారం తీర్చుకోవాలని బరిలోకి దిగింది. అయితే మూడో వన్డేలోనూ టీమిండియా బ్యాట్స్మెన్ తడబడ్డారు. తమ స్థాయి ప్రదర్శన చేయలేక అభిమానులను నిరాశ పరిచారు. 

 

 

 అయితే టీమిండియాలో వరుసగా బ్యాట్స్మెన్లు అందరూ నిరాశపరుస్తూ ఉన్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి ఫామ్లో కొనసాగుతూ భారీ స్కోర్లు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మూడో వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా భారత్ కష్టకాలంలో ఉన్న సమయంలో హాఫ్ సెంచరీ సాధించి తన అద్భుత ప్రదర్శన చేశాడు అయ్యర్. ఈ మధ్యకాలంలో టీమిండియాలో అద్భుత ప్రదర్శన చేస్తూ కీలక ప్లేయర్గా మారుతున్న విషయం తెలిసిందే. ఏకంగా విరాట్ కోహ్లీ సైతం నిరాశ పరిచినప్పటికీ... శ్రేయాస్  అయ్యార్  మాత్రం దుమ్ము దులిపాడు. కేఎల్ రాహుల్ తో కలిసి వంద పరుగులు జత చేసిన శ్రేయస్ అయ్యర్.. 62 బంతుల్లో 62 పరుగులు రాబట్టాడు. ఇక ఆ తర్వాత క్యాచ్ అవుట్ అయ్యి  వెనుదిరిగాడు. 

 

 

 అయితే మూడో వన్డేలో అర్థసెంచరీ సాధించి శ్రేయస్ అయ్యర్ వన్డేలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పది కన్నా ఎక్కువ మ్యాచ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సగటును సాధించిన ఆటగాడిగా నిలిచాడు శ్రేయస్ అయ్యర్. 16 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 9 అర్థ సెంచరీలు సాధించాడు. ఫలితంగా అత్యధిక హాఫ్ సెంచరీలు సగటు 56.25 సగటును నమోదు చేశాడు ఈ ఆటగాడు. శ్రేయస్ అయ్యర్ మొదటి స్థానంలో ఉండగా.. ఇయాన్ చాపెల్ 16 మ్యాచుల్లో 8 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: