మూడు వన్డేల సిరీస్ లో భాగంగా  3-0 తో సిరీస్  క్లీన్ స్వీప్ చేసి టీ 20ల్లో ఎదురైన పరాభవానికి భారత్ పై ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. మంగళవారం ఇరుజట్ల మధ్య జరిగిన  నామమాత్రమైన చివరి వన్డే లో భారత్ పై 5వికెట్ల తేడాతో  కివీస్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 296పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్  మరోసారి నిరాశపరచగా ఆ వెంటనే  కోహ్లీ కూడా తక్కవ స్కోర్ కే వెనుదిరిగాడు ఈదశలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. అయితే  హాఫ్ సెంచరీ కి చేరువవుతున్న క్రమంలో పృథ్వీ(40) రన్అవుట్ కాగా ఆతరువాత రాహుల్ ,శ్రేయస్ అయ్యర్ లు చక్కని సమన్వయం ఆడుతూ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక  హాఫ్ సెంచరీ చేశాక శ్రేయస్(62) వెనుదిరుగగా రాహుల్ కు మనీష్ పాండే జతకలిశాడు . ఈక్రమంలో రాహుల్ వన్డేల్లో నాలుగో సెంచరీ పూర్తిచేశాడు ఆతరువాత కాసేపటికే  రాహుల్(112),మనీష్ (42)పెవిలియన్ చేరగా చివర్లో జడేజా ,ఠాకూర్ ,చెరో ఫోర్ సైని రెండు ఫోర్లు బాదడం తో టీమిండియా కివీస్  ముందు కష్టతరమైన లక్ష్యాన్నే వుంచగలిగింది.  
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. గప్తిల్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించగా నికోల్స్ అతనికి సహకరించాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో గప్తిల్(66) అవుట్ కాగా ఆతరువాత వచ్చిన  విలియమ్సన్  కూడా తొందరగానే వెనుదిరిగాడు. అయితే ఈ దశలో వెంటనే కివీస్  మరో రెండు వికెట్లు కోల్పోయింది. దాంతో భారత్ పోటీ లోకి వచ్చింది. అయితే పసలేని బౌలింగ్  తో భారత్ఓటమిని చవిచూసింది. నికోల్స్ (80) అవుట్ అయ్యాక లేతమ్ , గ్రాండ్ హోమ్ లు మరో వికెట్ పడకుండా  లాంఛనాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా గ్రాండ్  హోమ్ చెలరేగాడు కేవలం 21బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు దాంతో కివీస్ 47.1 ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేరుకుంది. భారత్ బౌలర్ల లో స్పిన్నర్లు ఓకే  అనిపించగా ఫాస్ట్ బౌలర్లు అట్టర్ ప్లాప్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: