గాయం కారణంగా ఇటీవల  కొన్నినెలలు  జట్టుకు దూరంగా వున్న టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈఏడాది జనవరి లో శ్రీలంక తో జరిగిన టీ 20 సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ నుండి  బుమ్రా  చెప్పకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో పెద్దగా  రాణించలేకపోగ తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డే ల సిరీస్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 
 
ఆప్రభావం వల్ల  వన్డే ల్లో బుమ్రా తన నెంబర్ ర్యాంక్ ను కోల్పోయాడు.  ఐసీసీ తాజాగా వన్డే ర్యాకింగ్స్ ప్రకటించగా  719 పాయింట్లతో బుమ్రా ఐసీసీ వన్డే బౌలర్ల  ర్యాంకింగ్స్  జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు. ఈ సిరీస్ లో ఆడకున్నా  రెండో స్థానం లో వున్న  కివీస్ ఫాస్ట్ బౌలర్  ట్రెంట్ బౌల్ట్ 727పాయింట్ల తో మొదటి స్థానికి ఎగబాకాడు. ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్  ముజీబుర్ రెహామాన్ 701పాయింట్ల తో మూడో స్థానం లో వున్నాడు. 
 
ఇక ఐసీసీ వన్డే  బ్యాటింగ్ ర్యాంకింగ్స్ జాబితా లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్లు  కోహ్లీ 869పాయింట్ల తో మొదటి స్థానం లో ఉండగా 855 పాయింట్ల తో రోహిత్ శర్మ రెండో స్థానం లో వున్నాడు. అలాగే వన్డే ఆల్ రౌండర్ల  జాబితాలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర  జడేజా 246పాయింట్ల తో 7వ స్థానం లో కొనసాగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: