క్రికెట్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అయితే అన్ని క్రీడల కంటే క్రికెట్ ని ఎక్కువగా ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. ఇక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు స్టేడియంలో ఫుల్ గా  నిండిపోతారు ప్రేక్షకులు. ఇక మైదానంలో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉంటే స్టేడియంలో నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు అభిమానులు  కొంతమంది టీవీల ముందు నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే క్రికెట్ మ్యాచ్ ల విషయానికి వస్తే సంచలన  విజయాలతో కొన్ని జట్లు మంచి రికార్డులు సాధిస్తే...  మరికొన్ని జట్లు  మాత్రం చెత్త రికార్డులను నెలకొల్పుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ క్రికెట్ చరిత్రలోనే ఓ చెత్త రికార్డు నెలకొల్పబడింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదైంది. 

 

 

 ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ లో భాగంగా ఈరోజు నేపాల్ అమెరికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అమెరికా పేలవ ప్రదర్శన చేసి  చెత్త రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా ఐసిసి క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో అత్యల్ప స్కోరు నమోదు చేసి అమెరికా జట్టు చెత్త  రికార్డు సృష్టించింది. కేవలం 12 ఓవర్లు ఆడిన అమెరికా జట్టు  35 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. అయితే అమెరికా కంటే ముందు వన్డేల్లో అతి తక్కువ పరుగులు చేసి ఆలౌట్ అయిన జట్టుగా రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. 2004 సంవత్సరంలో శ్రీలంకతో మ్యాచ్ ఆడిన జింబాబ్వే జట్టు కేవలం 18 ఓవర్లలో... 35 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. 

 

 

 ఇక ఇప్పుడు తాజాగా అమెరికా జట్టు  35 పరుగులు చేసి జింబాబ్వేతో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నేపాల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుని అమెరికా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తర్వాత అమెరికా జట్టు బ్యాటింగ్కు దిగగా..  ఓపెనర్ గ్జేవియర్ మార్షల్ మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేయగలిగాడు. ఇతను 16 పరుగులు చేశాడు. ఇక మిగతా జట్టు సభ్యులందరూ కనీసం ఐదు పరుగులు కూడా చేయలేక పెవిలియన్ బాట పట్టారు. నేపాల్ బౌలర్లు  కూడా అమెరికా బాట్ మెన్ ల  వికెట్ పడగొట్టి సంచలన రికార్డు నమోదు చేశారని చెప్పాలి . నేపాల్ బౌలర్లలో  సందీప్ లామిచ్చానే  16 పరుగులకు ఆరు వికెట్లు తీయగా సుశాన్ భారీ  5 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో భాగంగా 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది నేపాల్ జట్టు .

మరింత సమాచారం తెలుసుకోండి: