ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రేక్షకులకు సందడి మరింత ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో భారత ఆటగాళ్లు అందరూ వివిధ ప్రాంతాల వారిగా విడిపోయి... విదేశీ ఆటగాళ్లను కలువుకుని... భారత ఆటగాళ్లతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. దీంతో క్రికెట్ మరింత రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి బాగా రాణిస్తూ వరుస  ట్రోఫీలను గెలుచుకుంటున్న  జట్టు ఏది అంటే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ అనే చెప్పొచ్చు. మధ్య మధ్యలో వేరే జట్లు టైటిల్ గెలుచుకున్నప్పటికి ఈ రెండు జట్ల లో ఏదో ఒక జట్టు ఫైనల్ వరకు చేరుకుంటుంది. అయితే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ప్లే ఆప్ కి అర్హత సాధించలేని జట్టు ఏది అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అయితే ఈ జట్టుకు సరైన ఆటగాళ్లు లేరా అంటే అది కాదు ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్ళందరూ ఈరోజు జట్టు  లోనే ఉంటారు... ఇక ఈ జట్టు కెప్టెన్ సరిగ్గా లేరా  అంటే అరెరే  అలా అంటే ఎలా...భారత జట్టుని   ముందుండి నడిపించి ఎన్నో విజయాలను సాధిస్తున్న విరాట్ కోహ్లీ ఈ జట్టుకు సారది. 

 


 అయినప్పటికీ ఈ జ mట్టుకు మాత్రం ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు. ఇప్పటివరకు ఏ ఒక్క ఐపీఎల్ లో కూడా ప్లే ఆఫ్ కి అర్హత సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ  జట్టులో కీలక మార్పులు జరుగుతాయని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఆ ఆర్సీబీ  ప్రాంచైజీ తీరు  ప్రస్తుతం దుమారం రేపుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లి కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరు లో చిన్న మార్పులు చేయడంతోపాటు కూడా మార్చాలని భావిస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రొఫైల్ని పోస్టులను తొలగించింది ప్రాంచైజీ. దీంతో ఆర్సిబి లో ఏం జరుగుతుంది అని అటు అభిమానులు ఇటు ఆటగాళ్లలో కూడా అయోమయం నెలకొంది. దీంతో అభిమానులు అందరూ ప్రొఫైల్ ఫోటోలు  తొలగించడంపై కెప్టెన్ కోహ్లి పై ప్రశ్నల వర్షం కురిపించారు. 

 

 అయితే అభిమానుల ప్రశ్నకు స్పందించిన విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు పోస్టులు కనబడకుండా పోవడం పై కెప్టెన్గా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఏదైనా సాయం కావాలా అంటూ ఆర్సిబి ఫ్రాంచైజీని ప్రశ్నించాడు విరాట్ కోహ్లీ. అయితే కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీ కే కాదు ఏ ఆటగాడికి కూడా సమాచారం ఇచ్చినట్లు కనిపించడం లేదు నేపథ్యంలో కొందరు ఆటగాళ్లు... ఆర్సీబీ  సోషల్ మీడియా అకౌంట్ కి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ  ఆటగాళ్ళైనా ఎబి డివిలియర్స్ చాహల్  సైతం సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ  ఫ్రాంచైజీని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: