నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఓపెనింగ్ కు సిద్దమవుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం గా రికార్డుల్లోకెక్కిన  ఈ స్టేడియాన్ని నరేంద్ర మోదీ తో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభోత్సవం చేయనున్నాడు. ఈనెల 24,25వ తేదిల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నాడు. నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ మొదటి సారి ఇండియాకు రానున్నాడు. అందులో భాగంగా న్యూఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా స్టేడియం కు చేరుకోనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ, ట్రంప్ ప్రసంగించనున్నారు
 
ఇక సర్దార్ వల్లభాయ్ స్టేడియం విషయానికి వస్తే  స్థానికంగా వున్న మొతేరా మైదానాన్ని ప్రపంచం లోనే అతి పెద్ద స్టేడియం గా మార్చాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. 2015 నుండి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఈపనులు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా 5సంవత్సరాలకు స్టేడియం పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1.10 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన వున్న ఈస్టేడియాన్ని 700కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇంతకుముందు ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా ఉండగా తాజాగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆస్థానాన్ని ఆక్రమించింది. ఈస్టేడియం కేవలం క్రికెట్ మ్యాచ్ లకు మాత్రమే కాకుండా ఫుట్ బాల్,బ్యాట్మెంటన్ , కబడ్డీ, హాకీ వంటి క్రీడలకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: