టెస్టు సిరీస్ కు ముందు న్యూజిలాండ్ ఎలెవన్ తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్లు చటేశ్వర్ పుజారా,హనుమ విహారి అదరగొడుతున్నారు. 38పరుగులకే 4వికెట్లు కోల్పోయిన భారత్ ను ఈజోడి ఆదుకుంది. చక్కని సమన్వయంతో  ఆడుతూ ఈ ఇద్దరుసెంచరీల కు చేరువయ్యారు. ప్రస్తుతం భారత్ 68 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 271పరుగులు చేసింది. పుజారా 88*,హనుమ విహారి 85* క్రీజ్ లో వున్నారు. ఇక ఈమ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు యువ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ , పృథ్వీ షా పేలవమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ లో దారుణంగా నిరాశపరిచిన ఈ జోడి  మరోసారి అదే  ప్రదర్శన కనబర్చారు. మయాంక్  ఒకే పరుగు చేసి అవుట్ కాగా పృథ్వీ డకౌట్ అయ్యాడు. అనంతరం బ్యాక్ అప్ ఓపెనర్  శుభమాన్ గిల్ నాలుగో స్థానం లో వచ్చి అతను కూడా డకౌట్ అయ్యాడు. ఆతరువాత  రహానే(18) కూడా ఎక్కవ సేపు క్రీజ్ లో నిలువలేకపోయాడు.  
 
ఇక ఇదిలా వుంటే గాయం తో రోహిత్ టెస్టు సిరీస్ కూడా దూరం కావడం.. రాణిస్తారనుకుంటున్న యువ ఓపెనర్లు ఫామ్ ను కోల్పొవడంతో టెస్టు సిరీస్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు అద్భుతమైన ఫామ్ లో వున్న కేఎల్ రాహుల్ ను టెస్టు లకు ఎంపిక చేసిన ఓపెనింగ్ సమస్య కొంతైనా తీరేది.. కానీ అతన్ని పట్టించుకోలేదు దాంతో వన్డే  సిరీస్ లో లాగా టెస్టు సిరీస్ లో కూడా భారత్ కు ఓపెనింగ్ సమస్య తీరేలా కనిపించడం లేదు. ఈనెల 21నుండి న్యూజిలాండ్-భారత్ ల మధ్య రెండు టెస్టు ల సిరీస్ ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: