భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేర్లలో గంగూలీ ఒకటి. గంగూలీ రాక ముందు భారత క్రికెట్ వేరు గంగూలీ అడుగు పెట్టిన తర్వాత క్రికెట్ వేరు. టీం ఇండియా క్రికెట్ కి దూకుడు నేర్పిన ఆటగాడు గంగూలీ. ఒక కెప్టెన్ గా ఎలా ఉండాలో అలా ఉంటూ అంతర్జాతీయ క్రికెట్ కి భారత క్రికెట్ పవర్ చూపించిన అరుదైన ఆటగాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి కోసం గంగులీ తెగింపు అతని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

 

గంగూలీ తండ్రి చండీదాస్‌ గంగూలీకి కోల్‌కతాలో ఒక ప్రముఖ వ్యాపారి. విలాసవంతమైన జీవితం గడిపేవాడు గంగూలీ. ఈ క్రమంలోనే తన పక్కింటి అమ్మాయితో గంగూలీ ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి పేరు డోనా. రోజు గంగూలీ ఇంటి ముందు నుంచే ఆమె వెళ్ళేది. ఇక గంగూలీ కూడా తన ఇష్టమైన ఆట ఆడుతూ ఆమెను చూస్తూ ఉండే వాడు. ఆమెకు ఫిదా అయిపోయిన గంగూలీ ఆమె కోసం ఆమె చదువుతున్నా స్కూల్ కి వెళ్ళే వాడు. 

 

అయితే ఎప్పుడు కూడా ఆమెతో గంగులీ నేరుగా మాట్లాడిన సందర్భం అంటూ ఏదీ లేదు. కేవలం కలిసినా సరే చూపుల వరకు మాత్రమే పరిమితం అయ్యే వారు ఇద్ద్దరూ. ఇక సౌరవ్ జీవితంలో రెండు లక్ష్యాలను పెట్టుకున్నాడు. ఒక డోనా రెండు క్రికెట్. వీటి కోసమే తన లైఫ్ అనుకున్నాడు. ఇక ఈ సమయంలోనే టీం ఇండియాకు ఎంపిక కావడం, ఇంగ్లాండ్ పై తొలి టెస్ట్ లోనే సెంచరీ చేయడంతో గంగూలీ పేరు మారు మొగిపోయింది. 

 

ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు గంగులీ. వెంటనే తన ప్రేమను ఆమెకు చెప్పేసాడు. ఆ తర్వాత విషయాన్ని రెండు కుటుంబాల వద్దకు తీసుకువెళ్ళినా సరే వాళ్ళు అంగీకరించలేదు. వాస్తవానికి వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వ్యాపారంలో కూడా భాగస్వామ్యం ఉంది ఇద్దరికీ. ఆ తర్వాత, వ్యాపారంలో కూడా గొడవలు రావడంతో కత్తులు నూరే పరిస్థితి రెండు కుటుంబాల మధ్య నెలకొంది. 

 

గంగూలీ తండ్రి వీరి ప్రేమకు ఓకే చెప్పినా డోనా తండ్రి మాత్రం అంగీకరించలేదు. అందుకే గంగూలీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన మిత్రుడు బెనర్జీతో కలిసి ఒక ప్లాన్ వేసి... ఎవరికీ తెలియకుండా డోనాను రిజిస్ట్రార్ మ్యారేజ్ చేసుకోవాలనుకుని అంతా సిద్దం చేసుకున్న తర్వాత అక్కడికి గంగూలీ వస్తున్నాడని తెలుసుకుని అతని అభిమానులు భారీగా చేరుకున్నారు. 

 

దీనితో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత బెనర్జీ, రిజిస్టార్ ని ఇంటికే పిలిచి వారి వివాహం చేసాడు. ఎవరి ఇళ్ళకు వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయారు. వీరి రహస్య పెళ్లి గురించి బెంగాల్ లో చాలా మంది తెలుసుకోవాలని ట్రై చేసినా వివరాలు మాత్రం తెలియలేదు. వాళ్లకు పెళ్లి జరిగిందని మీడియా అంటున్నా కాదని రెండు కుటుంబాలు అనేవి, ఆ తర్వాత ఒక సీనియర్ జర్నలిస్ట్ పక్కా ఆధారాలు సంపాదించి మొదటి పేజీలో కథనం ప్రచురించడంతో అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు నిదానంగా అంగీకరించడంతో దీంతో 1997, ఫిబ్రవరి 21న సౌరవ్, డోనా పెళ్లిని ఇరు కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: