టీం ఇండియా స్టార్ క్రికెటర్స్ లో రోహిత్ శర్మ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు ఆరేళ్ళకు గాని తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చూపించలేదు. ఎవరికి సాధ్యం కాని విధంగా అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు రోహిత్. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా అతని పేరే మీదే ఉంది. 264 పరుగులతో ఎవరికి అందని ఎత్తులో నిలిచాడు. 

 

ఇక ఇదిలా ఉంటే తన వ్యక్తిగత జీవితం కూడా తన ఆటలోనే అంత అందంగా ఉంటుంది. తన మేనేజర్ రితికా సజ్దేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రోహిత్. రోహిత్ క్రీజ్ లో ఉంటే అతని బ్యాటింగ్ అయ్యే లోపు ఒక పది సార్లు అయినా అతని భార్య వైపు కెమెరాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. క్రికెట్ చూసే వాళ్లకు ఇది స్పష్టంగా తెలుసు. ఇక వారి ప్రేమ విషయానికి వచ్చి చూద్దాం. 

 

వాస్తవానికి రితిక ఒక స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్. ఇందులో భాగంగానే వృత్తి పరంగా రోహిత్ కి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమె క్రికెటర్లకు ఈవెంట్స్ చేస్తూ ఉండేది. అందులో భాగంగానే రోహిత్ కి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఈ నేపధ్యంలో తన అవసరాల కోసం రితికను పలు మార్లు రోహిత్ కలిసాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడటం. ఆ తర్వాత ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం జరిగింది. 

 

ముందు ఇద్దరూ కొంత కాలం పాటు ఎవరికి తెలియకుండా డేటింగ్ కూడా చేసారు. అసలు మీడియాకు కూడా అతని వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడు తెలియలేదు. ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌లో రితికాకు రోహిత్  ప్రపోస్ చేసాడు. వెంటనే రితిక అంగీకరించడం ఆ తర్వాత ఇద్దరి వివాహం ​​2015 లో తాజ్ ల్యాండ్స్ ముంబైలో జరిగింది. అయితే చాలా మంది యువరాజ్ సోదరి రితిక అనుకునే వాళ్ళు. కాని ఆమె యువరాజ్ కి రాఖీ మాత్రమే కట్టిన  సోదరి.

మరింత సమాచారం తెలుసుకోండి: