టీం ఇండియా క్రికెట్ గురించి పరిచయం ఉన్న వాళ్లకు పెద్దగా పరిచయం లేని ఒక వివాదాస్పద ప్రేమ కథ, మురళి విజయ్, నిఖిత కార్తిక్. అంతర్జాతీయ క్రికెట్ లోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఈ వ్యవహారంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. వివరాల్లోకి వెళితే 2007 డిసెంబర్ లో నిఖిత, దినేష్ కార్తిక్ ని వివాహం చేసుకుంది. ఆమె ముంబైకి చెందిన కాస్టింగ్ ఆర్టిస్ట్. 

 

ఆ తర్వాత కొంత కాలం సాఫీగానే సాగిన వీరి వివాహ బంధం ఆ తర్వాత అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. 2012 లో మొదటి బిడ్డ పుట్టగానే నిఖిత, దినేష్ కార్తిక్ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ వెంటనే నిఖిత అనూహ్యంగా మురళి విజయ్ ని వివాహం చేసుకుంది. అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది ఎవరికి స్పష్టత లేదు. అయితే దీని గురించి తెలిసిన తమిళ మీడియా మాత్రం ఇప్పటి వరకు ఎన్నో కథనాలు ప్రచురించింది. 

 

నిఖిత కార్తిక్ ని మురళి విజయ్ ప్రేమించాడని, ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ డేటింగ్ కి కూడా వెళ్ళారని... అప్పుడు నిఖితకు గర్భం రావడంతోనే వాళ్ళు విడాకులు తీసుకుని విడిపోయారని అంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఆ ముగ్గురూ ఎక్కడా స్పందించలేదు. అయితే ఇది కేవలం గాసిప్ అని, వాళ్ళు ఇద్దరూ మనస్పర్ధల కారణంగా విడిపోయారని నేషనల్ మీడియా అంటుంది. 

 

ఆ తర్వాత విజయ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. ఒక ఇంటర్వ్యులో మురళి విజయ్ మాట్లాడుతూ... ఇదంతా హడావుడి గాని తమ మధ్య ఏ విభేదాలు రాలేదని, అది చాలా చిన్న సమస్య అని తాము చాలా త్వరగా ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కున్నాం అని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు దినేష్ కార్తిక్, స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఏది ఎలా ఉన్నా మీడియా కథనాలే మినహా దీని గురించి ఎవరికి స్పష్టమైన సమాచారం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: