టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ లో అంచెలు అంచెలుగా పైకి ఎదిగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గంభీర్ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం పెద్దగా ఎవరికి పరిచయం లేదు. కాని అతనికి ఆప్త మిత్రుడు మాత్రం సెహ్వాగ్ అని అంటూ ఉంటారు. ఇద్దరూ టీం ఇండియాకు ఓపెనర్లుగా రాణించారు. 

 

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన జోడీగా ఈ ఇద్దరు పేరు సంపాదించారు. అయితే ఇదే సమయంలో గంభీర్ జీవితంలో సెహ్వాగ్ కీలక పాత్ర పోషించాడని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని కొంత కాలం వరకు మీడియా కూడా ఇదే చెప్పేది. గంభీర్... నటాషా అనే తన చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించాడు. ఇరు కుటుంబాలకు 30 ఏళ్ళ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. 

 

 

కాని గంభీర్ ని నటాషా కుటుంబం అంగీకరించలేదు అనే టాక్ అప్పట్లో ఎక్కువగా మీడియాలో వచ్చింది. వాస్తవానికి గంభీర్ తండ్రి దీపక్ గంభీర్ వస్త్ర వ్యాపారి. నటాషా తండ్రి రవీంద్ర జైన్ కూడా వస్త్ర వ్యాపారి. కాని గంభీర్ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత ఇద్దరు దూరమయ్యారని చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న సెహ్వాగ్ ఒక అన్న పాత్రలో ఉండి ఇరు కుటుంబాలతో మాట్లాడి ఒప్పించాడని అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని, నేషనల్ మీడియా చెప్పింది కాబట్టి నిజమే అయి ఉండవచ్చు అనేది కొందరి వాదన. 2011లో వీరి వివాహం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: