కనీసం గర్భం దాల్చిన విషయం కూడా తెలియకుండా మూడో బిడ్డకు జన్మనిచ్చింది మాజీ ప్రముఖ టెన్నీస్ స్టార్ అన్నా కోర్నికోవా. గత నెల, అంటే జనవరి 30న కోర్నికోవా, ఆమె భర్త మ్యూజిక్ సెలబ్రిటీ ఎన్‌రిక్యూ ఇగ్లేసియస్ దంపతులకు మూడో బిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని కనీసం తమ సన్నిహితులకు కూడా చెప్పలేదు ఈ జంట. మీడియాకు ఎక్కడా లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

 

ఈ విషయాన్ని తాజాగా ఆమె భర్త సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలియజేసాడు. ఎన్‌రిక్యూ ఇగ్లేసియస్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు.

 

కనీసం అప్పటి వరకు ఆమె గర్భవతి అనే విషయం కూడా తెలియదు. కాన్పు జరిగిన ఆస్పత్రిలో తమ శిశువును తన చేతులపై పెట్టుకున్న ఫోటోను ఆయన పోస్ట్ చేసారు. ఈ దంపతులకు నికోలస్, లూసీ అనే కవల పిల్లలు ఉన్నారు. అదే విధంగా అన్నా కోర్నికోవా కూడా మరో రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో పలువురు అభిమానులు వారికి అభినందనలు తెలుపుతున్నారు.

 

ఇక మరో విషయం ఏంటీ అంటే గర్భాన్ని ఎలా దాచారు అంటూ పలువురు ప్రశ్నించడం గమనార్హం. వీరిద్దరికీ సరిగా 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. టెన్నీస్ ఆడే సమయంలో కోర్నికోవా అందం చూడటానికి వచ్చే వాళ్ళు అభిమానులు.

https://www.instagram.com/p/B8hEdz6BmR_/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B8hGBwcpf1z/?utm_source=ig_embed

https://www.instagram.com/p/B8hHxfQpBbv/?utm_source=ig_embed

 

మరింత సమాచారం తెలుసుకోండి: