ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ బ్యాట్ తో మెరుపులు మెరిపించడం తో సౌతాఫ్రికా తో జరుగుతున్నరెండో టీ 20లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. డర్బన్ లో జరుగుతున్న ఈమ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన  ఇంగ్లాండ్ ఆదిలోనే ఓపెనర్ వికెట్ ను కోల్పోయింది. కేవలం రెండు పరుగులే మాత్రమే చేసి  జాస్ బట్లర్ వెనుదిరగగా తరువాత వచ్చిన బెయిర్ స్టో తో కలిసి మరో ఓపెనర్ జాసన్ రాయ్ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ 6ఓవర్ల లోనే 60పరుగులు చేసింది. అయితే దూకుడుగా ఆడే క్రమంలో రాయ్ (40) అవుట్ కాగా మరో 21పరుగుల వ్యవధిలో బెయిర్ స్టో (35)కూడా వెనుదిరిగాడు. ఆతరువాత కాసేపటికి మరో రెండు వికెట్లు పడడం తో ఇంగ్లాండ్ కష్టాల్లో పడ్డట్లు అనిపించింది అయితే ఆల్ రౌండర్లు స్టోక్స్ ,మొయిన్ అలీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. 
 
ముఖ్యంగా అలీ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.11బంతుల్లోనే 4సిక్సర్లు, 3ఫోర్ల తో 39పరుగులు చేసి చిన్నపాటి విధ్వసం సృష్టించి అలీ వెనుదిరగగా చివర్లో స్టోక్స్(47*)తనదైన రీతిలో చెలరేగడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 204పరుగులు చేసింది.  సౌతాఫ్రికా బౌలర్ల లో ఎంగిడి 3 ,పెహళుక్వాయో 2, వికెట్లు పడగొట్టగా శంసి , ప్రిటోరియస్ చెరో వికెట్ తీయగలిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: