టీం ఇండియాలోకి అడుగు పెట్టిన కొన్ని రోజులకే యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దిగ్గజ ఆటగాళ్లకు కూడా చుక్కలు చూపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ పొట్టి లెగ్ స్పిన్నర్. చూడటానికి బక్కగా ఉంటూనే పదునైన బంతులతో బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెట్టడం ఇంతని సొంతం. దీనితో కోహ్లి ఏ మైదానంలో ఆడినా సరే ఇతన్ని జట్టులో ఉంచుకోవడానికే చూస్తూ ఉంటాడు. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా చాహల్ టాలెంట్ గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. యుజువేంద్ర చాహల్ ఎంతో తెలివైన బౌలర్‌ అని అభినందించాడు. రవీంద్ర జడేజా అప్పుడప్పుడూ వికెట్లు తీస్తున్నాడని... కుల్‌దీప్‌ యాదవ్‌ సత్తా చాటలేకపోతున్నాడని, కానీ చాహల్‌ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడని కొనియాడాడు. అతడిని తుదిజట్టులో నుంచి తప్పించకూడదని అభిప్రాయపడ్డాడు.

 

బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టే కొన్ని ట్రిక్స్‌ అతడికి తెలుసని వ్యాఖ్యానించాడు అదే విధంగా అతడు ఒక పరిపూర్ణ లెగ్‌ స్పిన్నర్‌ అని కితాబిచ్చాడు. బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించగలడన్నాడు. అతడు ఎంతో తెలివైనవాడని అక్తర్ కొనియాడటం విశేషం. కాని లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కుల్‌దీప్‌ ఒత్తిడిలో ఉన్నాడని, అతడు రాణించకపోవడం టీమ్‌ఇండియాకు ఆందోళన కలిగించే అంశమని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: