న్యూజిలాండ్ ఎలెవన్  తో జరిగిన  ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా  వికెట్ కీపర్ రిషబ్ పంత్  66బంతుల్లో 4 ఫోర్లు 4సిక్సర్ల సాయంతో  70 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. అతనితోపాటు వన్డే సిరీస్ లో విఫలమైన  ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా 81 పరుగులు చేసి సత్తాచాటాడు ఫలితంగా  రెండో ఇన్నింగ్స్ లో భారత్ 4వికెట్ల నష్టానికి 252పరుగులు చేసింది. కాగా మూడు రోజుల  ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 263పరుగులు చేయగా న్యూజిలాండ్ ఎలెవన్ 235పరుగులు చేసింది. 
 
ఇదిలావుంటే రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ , న్యూజిలాండ్ ల మధ్య మొదటి టెస్టు ఈనెల 21న ప్రారంభం కానుంది.  ఇప్పటికే కివీస్ తో  టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్..  వన్డే సిరీస్ ను మాత్రం క్లీన్ స్వీప్ చేయించుకుంది. దాంతో ఎలాగైనా  టెస్టు సిరీస్ ను గెలుచుకొని  పర్యటనను ముగించాలని టీమిండియా పట్టుదలతో వుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్  ఇషాంత్ శర్మ కూడా టెస్టులకు అందుబాటులో ఉండడం భారత్ కు కలిసి రానుంది. ఫిట్నెస్ పరీక్షలో పాస్ కావడం తో ఇషాంత్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఆదివారం అతను  జట్టుతో చేరనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: