క్రికెట్ అభిమానులలో టి20 అనగానే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పొట్టి ఫార్మాట్ ను ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఒక్క బాల్ తో ఫలితం మారిపోయే మ్యాచ్ లు కావడం, త్వరగా మ్యాచ్ అయిపోవడంతో టి20 వస్తుంది అంటే చాలు టీవీ ముందు అలా వాలిపోతారు. ఇప్పుడు మహిళల టి20 ప్రపంచకప్ రానుంది. దీనితో టాప్ దేశాలు అన్నీ కూడా ఈ ట్రోఫీని ఎలాగైనా సరే గెలుచుకోవాలని కఠోర సాధన చేస్తున్నాయి. 

 

ఇక అగ్ర జట్టు అయిన మన మహిళల జట్టు  ఈ ట్రోఫీ కోసం సన్నద్దమవుతుంది. ఈ నేపధ్యంలో దీనికి సంబంధించిన విశేషాలు చూడడం. ఈ తొలి ప్రపంచకప్ ని 2009 లో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే... టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు టీం ఇండియా మహిళా సచిన్ గా పిలవబడే మిథాలి రాజ్ లేకుండా బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ లో టీం ఇండియా హర్మాన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఆడుతుంది. 

 

ఆస్ట్రేలియా జట్టు ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. ఈ పొట్టి ఫార్మాట్ లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచులు జరుగుతున్నాయి. టీం ఇండియా 24న బంగ్లాదేశ్, 27 న్యూజిలాండ్, 29న శ్రీలంకతో మ్యాచ్ లు ఆడనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు సెమీస్ కి చేరుతుంది. టీం ఇండియాకు హర్మాన్, స్మృతి మంధనా, పూనం యాదవ్ అదనపు బలం కానున్నారు. 

 

భారత జట్టు చూస్తే; హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, రిచా ఘోష్, తానియా భాటియా, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: