టీం ఇండియా లో ఇప్పుడు ఒక ప్రశ్న అభిమానులను ఎంతగానో వేధిస్తుంది. ఆ ప్రశ్న వేదనో లేక అర్ధం కానిదో కాని చాలా మంది సమాధానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటీ అంటే... అసలు కెఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసే స్థానం ఏదీ...? ఓపెనర్ గా, వన్ డౌన్ లో, నాలుగో స్థానంలో, ఇప్పుడు అయిదో స్థానంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆడుతూ అభిమానులతో పాటు క్రీడా పండితులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. 

 

అయితే ఇక్కడ ఒక ప్రశ్న వినపడుతుంది. అది ఏంటీ అంటే, రాహుల్ ని కావాలనే కోహ్లీ ఇలా రెడీ చేస్తున్నాడని అంటున్నారు. టీం లో ఇప్పటి వరకు నాలుగు అయిదు స్థానాల విషయంలో సమస్య ఉంది. యువరాజ్, ధోనీ, ద్రావిడ్ తర్వాత అసలు అక్కడ ఆడేది ఎవరూ అనేది చాలా మందికి అర్ధం కాలేదు. అందుకే కోహ్లీ ఇప్పుడు కీలక నిర్ణయ౦ తీసుకున్నాడు. రాహుల్ టీం లో ఉండాలి. 

 

అతను ప్రతీ స్థానం లో బ్యాటింగ్ చెయ్యాలి. ప్రతీ ప్లేస్ లో అతను నిలబడాలి. అవసరమైతే ఓపెనింగ్ చెయ్యాలి, తాను తప్పుకుంటే మూడో స్థానంలో ఆడాలి.. లేదు నాలుగులో శ్రేయాస్ అయ్యర్ ఆడకపోతే ఆ స్థానాన్ని కవర్ చెయ్యాలి. అదీ కాకపోతే బ్యాటింగ్ చేస్తూ అయిదు, ఆరు స్థానాల్లో కూడా ఆడాల్సి ఉంటుంది. అందుకే ఏ స్థానం అయినా సరే అతను సిద్దంగా ఉండాలని కోహ్లీ రెడీ చేస్తున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: