టీ 20ల్లో ఇంగ్లాండ్ టీం ఎంత స్ట్రాంగో మరోసారి రుజువైంది. ఆదివారం సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో టీ 20లో 222పరుగుల లక్ష్యాన్ని 5వికెట్లు కోల్పోయి 19.1ఓవర్ లోనే  ఛేదించి అదుర్స్ అనిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్ల లో 6వికెట్ల నష్టానికి  222పరుగులు చేసింది. క్లాసేన్ 33బంతుల్లో 66 (4X4,6x6) మెరుపులకు తోడు , బవుమా (49),డికాక్ (35),మిల్లర్(35*) రాణించడం తో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. 
 
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ ...  ఓపెనర్ రాయ్ వికెట్ త్వరగానే కోల్పోగా మరో ఓపెనర్ బట్లర్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో, సౌతాఫ్రికా బౌలర్ల కు చుక్కలు  చూపించారు. బెయిర్ స్టో 34బంతుల్లో 7ఫోర్లు,3సిక్సర్ల సాయంతో 64పరుగులు చేయగా జాస్ బట్లర్ 29బంతుల్లో 9ఫోర్లు ,2 సిక్సర్ల తో 57 పరుగులు చేసి వెనుదిరిగారు. అనంతరం మలాన్ వెంటనే వెనుదిరగా స్టోక్స్ తో కలిసి కెప్టెన్ మోర్గాన్  ఆకాశమే హద్దుగా చెలరేగాడు.  22 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో  మోర్గాన్ అజేయంగా  57పరుగులు చేయగా స్టోక్స్ 12 బంతుల్లో 2ఫోర్లు,2సిక్సర్ల సాయంతో 22పరుగులు చేయడం తో  ఇంగ్లాండ్ లక్ష్యానికి  చేరువైంది. ఈక్రమం లో స్టోక్స్ ఔటైనా  20ఓవర్ మొదటి బంతిని బౌండరీ గా మలిచి మొయిన్ అలీ ,ఇంగ్లాండ్ గెలుపును ఖరారు చేశాడు. ఈవిజయం తో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను 2-1తో తేడాతో ఇంగ్లాండ్ గెలుచుకుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: