మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఆదివారం  సౌతాఫ్రికా తో జరిగిన మూడో టీ 20లో 5వికెట్ల తేడాతో  విజయం సాధించిన ఇంగ్లాండ్.. సిరీస్ ను 2-1 తో తేడాతో గెలుచుకుంది. ఇంతకుముందు మొదటి టీ 20 లో సౌతాఫ్రికా విజయం సాధించగా  రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తాజాగా జరిగిన మూడో టీ 20లో సౌతాఫ్రికా 222పరుగుల లక్ష్యాన్ని ఉంచినా కూడా కెప్టెన్ మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ సునాయాసంగా ఛేదించింది. 22బంతుల్లో 7సిక్సర్ల సాయంతో అజేయంగా 57పరుగులు చేసి మోర్గాన్  గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దాంతో మోర్గాన్ కు  ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
ఇక ఈ ఒక్క ఇన్నింగ్స్ మోర్గాన్ కు ప్లేయర్ అఫ్ ది సిరీస్ ను కూడా తెచ్చిపెట్టింది. ఈమ్యాచ్ లో 57 పరుగులు చేసిన మోర్గాన్ మొదటి మ్యాచ్ లో 52,రెండో మ్యాచ్ లో 27పరుగులతో సిరీస్ లో మొత్తం 136పరుగులు చేశాడు.  ఇక సౌతాఫ్రికా కెప్టెన్ డికాక్ ఈసిరీస్ లో 131 పరుగులు చేశాడు. దాంతో సిరీస్ టాప్ స్కోరర్ అయిన మోర్గాన్ ను ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. ఇదిలావుంటే  ఈసిరీస్ లో మోర్గాన్ ప్రదర్శన తో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఫుల్ హ్యాపీ అవుతుందనడంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన వేలం లో మోర్గాన్ ను  కేకేఆర్ 5.25 కోట్లకు దక్కించుకుంది. దాంతో ఐపీఎల్ కు ముందు మోర్గాన్ సూపర్ ఫామ్ లో ఉండడం ఆజట్టుకు ఆనందకరమైన విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: