టెస్టు సిరీస్ లో భాగంగా భారత్ తో జరుగునున్న రెండు టెస్టులకు 13మంది తో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. టీ 20 ,వన్డే సిరీస్ లకు దూరంగా వున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రీ ఎంట్రీ ఇవ్వగా దేశవాళీ క్రికెట్ లో అలాగే  ఇటీవల వన్డే సిరీస్ లో రాణించిన మరో ఫాస్ట్ బౌలర్  కైల్ జైమేసన్ కు చోటు కల్పించారు. అతినికిదే తొలి అంతర్జాతీయ టెస్టు సిరీస్..  వీరితో పాటు స్పిన్నర్ అజాజ్ పటేల్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 
 
ఇక ఆసీస్ తో టెస్టు సిరీస్ లో విఫలమైన ఆల్ రౌండర్ సాన్ టర్న్ కు షాక్ తప్పలేదు. అతని తోపాటు హెన్రీ, జీత్ రావల్ కూడా  జట్టులో  చోటు కోల్పోయారు. ఈనెల 21న ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుండగా 29నుండి రెండో టెస్టు జరుగనుంది. దాంతో న్యూజిలాండ్ లో టీమిండియా సుదీర్ఘ పర్యటన ముగియనుంది. 
 
భారత్ : విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,పృథ్వీ షా,మయాంక్ అగర్వాల్ ,రిషబ్ పంత్ , పుజారా,రహానే,సాహా ,హనుమ విహారి,అశ్విన్ ,బుమ్రా,షమీ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా ,గిల్,సైని ,ఇషాంత్ శర్మ 
 
న్యూజిలాండ్ : టామ్ లేతమ్,టామ్ బ్లండెల్,విలియమ్సన్(కెప్టెన్), టేలర్ ,వాట్లింగ్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, నికోల్స్, అజాజ్ పటేల్ , సౌథీ ,బౌల్ట్ ,జైమేసన్, వాగ్నెర్ ,మిచెల్ 
   

మరింత సమాచారం తెలుసుకోండి: