బీసీసీఐ చీఫ్ సెలక్టర్ గా వ్యవహరిస్తున్న తెలుగు మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ పదివి కాలం పూర్తయిన విషయం తెలిసిందే అయన తో పాటు సెలక్టర్ గగన్ ఖోడా  పదవి కాలం కూడా ముగిసింది. దాంతో బీసీసీఐ ఈరెండు స్థానాలను  భర్తీ చేసేందుకు  అర్హులను దరఖాస్తులకు ఆహ్వానించింది. అందులో భాగంగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్(ముంబై) తోపాటు చేతన్ శర్మ (హరియాణా)నయన్ మోగింయా (బరోడా)లక్ష్మణ్ శివరామకృష్ణన్ (తమిళనాడు )రాజేష్ చౌహన్ (మధ్య ప్రదేశ్ )అమేయ్ ఖురేషియా (మధ్య ప్రదేశ్ )గ్యానేంద్ర పాండే (ఉత్తర ప్రదేశ్ )ప్రీతమ్ గాంధే (విదర్భ )వెంకటేష్ ప్రసాద్ (కర్ణాటక) లు ఈ పదవుల కోసం పోటీలో నిలిచారు. 
 
అయితే వీరిలో నలుగురుని షార్ట్ లిస్ట్ చేసింది బీసీసీఐ.  అజిత్ అగార్కర్, శివ రామకృష్ణన్ , వెంకటేష్ ప్రసాద్ , రాజేష్ చౌహన్ లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వీరిలో ఒకరు చీఫ్ సెలక్టర్ గా ఎన్నిక కానుండగా మరొకరు ప్యానెల్ మెంబెర్ (సెలెక్టర్) గా ఎన్నికవ్వనున్నారు. మరి ఆ అదృష్టం వీరిలో ఎవరిని వరిస్తుందో చూడాలి. అయితే చీఫ్ సెలెక్టర్ పదవికి  శివరామకృష్ణన్ ,అగార్కర్ లలో ఎవరో ఒకరు ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. న్యూజిలాండ్ తో ఇండియా టెస్టు సిరీస్ ముగిసాక కొత్త సెలక్టర్ ను ప్రకటించనుంది బీసీసీఐ. 

మరింత సమాచారం తెలుసుకోండి: