క్రికెట్ లో విరాట్ కోహ్లీ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ గానే కాకుండా... ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్గా కూడా విరాట్ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఒక విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్ కూడా ఎంతోమంది అభిమానులు. ఎప్పుడు బరిలోకి దిగిన తనదైన బ్యాటింగ్  తో అదరగొడుతు ఎంతోమంది అభిమానులను అలరిస్తూ ఉంటారు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్  గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు  విరాట్ కోహ్లీ. ఎన్నో  రికార్డులు బద్దలు కొడుతూ తనదైన ఆట ప్రదర్శనతో అందరిని మెస్మరైజ్  చేస్తున్నాడు. 

 


 కాగా ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పి నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్నారు విరాట్ కోహ్లీ. ఎవరికీ సాధ్యం కాని రికార్డును సైతం నెలకొల్పారు విరాట్ కోహ్లీ.కాగా విరాట్ కోహ్లీ క్రికెట్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తన పర్సనల్ లైఫ్ సహా క్రికెట్కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఉంటారు విరాట్ కోహ్లీ. బ్యాట్ తో  పరుగులు రికార్డులను సృష్టిస్తున్న కోట్లకి వీరాభిమానులు తక్కువ లేరని మరోసారి రుజువైంది. 

 

 సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ  ఫాలోవర్స్ ఎంతగానో పెరిగిపోయారు. దీంతో ఇంస్టాగ్రామ్ లో అత్యధిక మంది ఫాలోవర్స్ సంపాదించిన తొలి భారతీయుడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. టాప్ బాలీవుడ్ సెలబ్రిటీలను రాజకీయ ప్రముఖులను సైతం వెనక్కి నెట్టి అత్యధికంగా ఐదు కోట్ల మంది ఫాలోవర్స్ తో ముందంజ లోకి వచ్చేశాడు. దీంతో డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అభిమానులందరికీ ధన్యవాదాలు... మనం ఇప్పుడూ ఇంస్టాగ్రామ్ లో 50 మిలియన్ మైలురాయిని సాధించాం.. అంతా మీ ప్రేమ మద్దతు వల్లే సాధ్యమైంది మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ కోహ్లీ ఓ వీడియోని షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

5⃣0⃣ Million strong on @instagram 💪🏼 Thank you guys for all the love and support. 🙏🏼😇

A post shared by Virat Kohli (@virat.kohli) on

మరింత సమాచారం తెలుసుకోండి: