మూడు ఫార్మాట్ లలో సారథిగా వ్యవహరిస్తూ తీరిక లేకుండా క్రికెట్ ఆడుతూ వస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో మూడేళ్ళ వరకు మూడు ఫార్మాట్ లలో కొనసాగుతానని పేర్కొన్నాడు. తాజాగా స్పోర్ట్స్ స్టార్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో మూడేళ్ళ వరకు ఇదే ఫిట్ నెస్ తో వుంటాను దాంతో అప్పటి వరకు అన్ని ఫార్మాట్ లలో ఆడగలను అలాగే 2023ప్రపంచకప్ తరువాతే తన భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు. ప్రస్తుతం కోహ్లీ వయసు 31సంవత్సరాలు. వచ్చే ప్రపంచ కప్ నాటికి  అతను 34 కు చేరుకుంటాడు. ఈలోగా కోహ్లీ రెండు టెస్టు ఛాంపియన్ షిప్ లను రెండు టీ 20 ప్రపంచకప్ లను అలాగే ఓ వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. 
 
ఇదిలావుంటే ఇటీవల సొంత గడ్డపై టెస్టుల్లో వరుస విజయాలను సాధిస్తూ నెంబర్ వన్ టీం గా దూసుకుపోతున్న టీమిండియా కు ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటన లో వున్న భారత్ ,రెండు టెస్టు ల సిరీస్ లో భాగంగా ఆతిథ్య ఆజట్టుతో  ఈనెల 21నుండి జరిగే మొదటి టెస్టు లో తలపడనుంది. ఈపర్యటనలో ఇప్పటికే టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఆతరువాత వన్డే సిరీస్ లో వైట్ వాష్ చేయించుకుంది. ఇక ఈటెస్టు సిరీస్ ను ఎలాగైనా గెలిచి ఈ సుదీర్ఘ పర్యటనను విజయం తో ముగించాలని భారత్ పట్టుదలతో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: