ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో గ‌త రెండు మూడేళ్లుగా బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోంది. బాలీవుడ్‌లో ఇటీవ‌ల వ‌చ్చిన బ‌యోపిక్‌లు చూస్తే ఎం.ఎస్.ధోని- యాన్ అన్ టోల్డ్ స్టోరి- భాగ్ మిల్కా భాగ్- మేరీకోమ్ హిట్ అయ్యాయి. దీనిని బ‌ట్టి స్పోర్ట్స్ బయోపిక్ లకు ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇప్పటికే ఎన్నో క్రీడా బయోపిక్ లు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో రాబోతున్న భార‌త  క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్‌ బ‌యోపిక్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

1983 క్రికెట్ నేప‌థ్యంలో జ‌రిగే సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది. 1983 వరల్డ్ కప్ విక్టరీలో టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను.. టీమిండియా విక్టరీ ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఆ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ వెస్టిండిస్‌లో జ‌రిగింది. ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు వెస్టిండిస్‌ను ఓడించి తొలిసారిగా జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. ఈ సినిమాలో క‌పిల్‌దేవ్ పాత్ర‌ను బాలీవుడ్ క్రేజీ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నాడు.

 

ఇక అతడి భార్య రోమి దేవ్ పాత్ర‌ను దీపిక ప‌దుకునే పోషిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి- మధు మంతెన- దీపిక సంయుక్తంగా నిర్మిస్తుండగా నాగార్జున సమర్పిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలవుతోంది. మ‌రి క‌పిల్ దేవ్ జీవిత చ‌రిత్ర కావడంతో దేశ‌వ్యాప్తంగా ఈ సినిమాపై అన్ని భాష‌ల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఆ అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుంటుందో ?  చూడాలి.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన లుక్ చూస్తే రోమీ దేవ్ పాత్ర‌లో దీపిక ప‌దుకొనే అచ్చు గుద్దిన‌ట్టుగా ఉంది. లుక్‌తో సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా హైప్‌కు చేరుకున్నాయి. మ‌రి ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: