పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ ఉమర్అక్మల్ ను ఉన్నపలంగా సస్పెండ్ చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదేశాలు జారీచేసింది. అవినీతి నిరోధక నియమావళి లోని ఆర్టికల్ 4.7.1కింద అక్మల్ ను సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెండ్ గల కారణాలను అలాగే ఎన్ని రోజులు ఈ సస్పెన్షన్ వేటు కొనసాగుతుందో వంటి విషయాలను పీసీబీ వెల్లడించలేదు. ఇక విచారణ ముగిసే వరకు ఉమర్ అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.
 
అయితే కొన్ని రోజుల ముందు లాహోర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన ఫిట్ నెస్ టెస్ట్ కు హాజరైన అక్మల్.. అందులో విఫలమై అక్కడి సిబ్బంది తో అభ్యతరకంగా ప్రవర్తించాడు. ఈవిషయంలో పీసీబీ,అక్మల్ ను తీవ్రంగా మందలించింది. తరువాత అక్మల్ కూడా క్షమాపణలు చెప్పడం తో పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతన్ని వదిలిపెట్టింది.
 
ఇదిలా ఉంటే ఈరోజు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీసీఎల్) ప్రారంభం కానుండగా ఉమర్ అక్మల్, క్యూట్ట గ్లాడియేటర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందే సస్పెండ్ చేసి పీసీబీ, అక్మల్ కు షాక్ ఇచ్చింది. దాంతో గ్లాడియేటర్స్ ,అక్మల్ స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో క్రికెటర్ ను తీసుకోనుంది. ఇక పాకిస్థాన్ తరపున ఉమర్ అక్మల్ ఇప్పటి వరకు 16 టెస్టులు ,121 వన్డేలు,84 టీ20లు ఆడాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: