ఐపీఎల్ ప్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్ల తో ఆల్ స్టార్స్ అనే చారిటీ మ్యాచ్ ను నిర్వహించనున్నామని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ  వెల్లడించిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్  ఈసీజన్  ఐపీఎల్  స్టార్ట్ అయ్యే మూడు రోజుల ముందు జరుగనుందని వార్తలు వచ్చాయి.  అయితే ఈ మ్యాచ్  వాయిదాపడింది. ఐపీఎల్ ముందు కాకుండా టోర్నీ ముగిసాక ఈ ఆల్ స్టార్స్ మ్యాచ్ ను నిర్వహిస్తే బాగుంటుందని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు  ఐపీఎల్ పాలక మండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ కీలక ప్రకటన చేశాడు. 
 
ఆల్ స్టార్స్ మ్యాచ్ ను ఐపీఎల్ సీజన్ కు ముందు కాకుండా చివర్లో నిర్వహిస్తాం. ఈఐపీఎల్ లో ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూసి దాని ఆధారంగా జట్లను ఎంపిక చేస్తాం అని ఆయన వెల్లడించాడు. ఈమ్యాచ్ కోసం ఎనిమిది జట్లను రెండు జట్లుగా  విడగొట్టనున్నారు. అందులో భాగంగా చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఒక టీంగా మిగిలిన నాలుగు జట్లు మరో టీంగా విడిపోనున్నాయి. ఇక ఈ ఆల్ స్టార్స్ మ్యాచ్ ను ప్రపంచలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరా లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2020 మార్చి 29న ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: