బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ శత జయంతి సందర్భంగా బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆసియా ఎలెవన్ మరియు వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా రెండు టీ 20లను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుందని తెలిసిందే. మార్చి18, 21న ఈరెండు టీ 20లు మిర్పూర్ లోని షేర్ -ఏ- నేషనల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఇక ఆసియా ఎలెవన్ జట్టులో ఆడేందుకు భారత ఆటగాళ్ల ను పంపాలని బీసీబీ ఇంతకుముందే బీసీసీఐ ను కోరగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అందుకు సుముఖత వ్యక్తం చేశాడు. అయితే గత కొంత కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న మాజీ సారథి ధోని, ఈ ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి కానీ అందుకు ధోని ఆసక్తి చూపించకపోవడంతో అతన్ని పక్కకు పెట్టి ఈ టీ 20లకోసం నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపికచేసిందని సమాచారం.
 
టీమిండియా కెప్టెన్ కోహ్లీ తోపాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అలాగే ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి, ఆసియా ఎలెవన్ తరుపున బరిలోకి దిగనున్నారని తెలుస్తుంది. అయితే వీరి పేర్లను బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. వీరితోపాటు బంగ్లాదేశ్ , శ్రీలంక , ఆఫ్ఘానిస్తాన్ జట్ల లోని స్టార్ ఆటగాళ్లు కూడా  ఆసియా ఎలెవన్ తరపున బరిలోకి దిగనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: