మహిళల టీ 20ప్రపంచ కప్ లో భాగంగా  శుక్రవారం సిడ్నీ వేదికగా గ్రూప్-ఏ లోని టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ 17పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్..  నిర్ణీత 20ఓవర్ల లో 4వికెట్ల నష్టానికి 132పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ షఫాలీ వెర్మ 15బంతుల్లో 5ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 29పరుగులతో మెరుపులు మెరిపించగా మరో ఓపెనర్ స్మృతి మందాన (10) నిరాశపరిచింది. వీరిద్దరి వికెట్లు కోల్పోయాక భారత్ స్కోర్ నత్తనడక సాగింది. దీప్తి శర్మ(49),రోడ్రిగుస్(26)  పరుగులు చేసిన కూడా నెమ్మదిగా ఆడారు. దాంతో భారత్ తక్కువ స్కోర్ కే పరిమితం కావాల్సి వచ్చింది. 
 
అనంతరం స్వల్ప లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కు భారత బౌలర్లు చుక్కలు చూపెట్టారు. పూనమ్ యాదవ్, షికా పాండే ల దాటికి  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ 19.5 ఓవర్ల లో ఆసీస్ 115పరుగులకు ఆల్ ఔటైయింది. ఓపెనర్ హీలీ(51),గార్డ్ నర్(34)పోరాడినా  కానీ ఫలితం దక్కలేదు. వీరిద్దరు తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్ల లో పూనమ్ యాదవ్ 4, షికా పాండే 3వికెట్లు తీయగా రాజేశ్వరి ఓ వికెట్ పడగొట్టింది. ఇక 4వికెట్ల తో విజయం లో కీలక పాత్ర పోషించిన పూనమ్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: