క్రికెట్ మ్యాచ్ లో బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం చాలా సార్లే చూశాం కానీ ఒకే మ్యాచ్ లో ఒకే బౌలర్  రెండో సార్లు హ్యాట్రిక్ వికెట్ల ను తీయడం ఇంతవరకు జరుగలేదు అయితే ఈ అరుదైన రికార్డు ను సృష్టించే అవకాశాన్ని తృటి లో మిస్ చేసుకున్నాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆస్టన్ అగార్. శుక్రవారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లమధ్య జరిగిన మొదటి టీ 20లో 107 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20ఓవర్ల లో 6వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.  
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ను అగార్ వణికించాడు. ఎనిమిదో ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన అగార్ ఆ ఓవర్ నాలుగో బంతికి డు ప్లెసిస్ ను అవుట్ చేయగా మిగితా రెండు బంతుల్లో పెహళుక్వాయో ను అలాగే స్టెయిన్ ను బోల్తా కొట్టించి కెరీర్ లో మొదటి హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. అనంతరం 12ఓవర్ చివరి బంతికి వాన్ బీల్జోన్ ను బౌల్డ్ చేసిన అగార్ 14ఓవర్ మొదటి బంతికి ఎంగిడి ని అవుట్ చేశాడు దాంతో అగార్ తదుపరి బంతికి వికెట్ తీస్తే రెండో హ్యాట్రిక్ ను ఖాతాలో వేసుకునే వాడు కానీ శంసి దాన్ని అడ్డుకున్నాడు. అలా ఒకే మ్యాచ్ లో రెండో హ్యాట్రిక్ ను తీసే అద్భుతమైన అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు.
 
ఇక అగార్ దాటికి సౌతాఫ్రికా 14.3 ఓవర్లో 89పరుగులకే ఆల్ ఔటై చిత్తుగా ఓడిపోయింది. ఈమ్యాచ్ లో అగార్ బంతి తోమాత్రమే కాదు బ్యాట్ తోనూ రాణించాడు. 9బంతుల్లో అతను రెండుఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 20పరుగులు చేసి అజేయంగా నిలువగా బంతి తో 5వికెట్లు తీశాడు దాంతో అగార్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: