ప్ర‌పంచంలో ఎక్కువ స్టేడియాలు ఉన్న దేశం భార‌త్‌. ఎన్నో దేశాల్లో ఎన్నో ఆట‌ల‌కు సంబంధించి స్టేడియాలు ఉన్నా భార‌త్లో ఉన్న‌న్ని స్టేడియాలు ఎక్క‌డా .. ఏ దేశంలో కూడా లేవు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన‌, పెద్ద స్టేడియాలు రెండూ మ‌న దేశంలోనే ఉన్నాయి. ఇక ఎత్తైన స్టేడియం విష‌యానికి వస్తే అది హిమాచల్​ప్రదేశ్​లోని చైల్​ క్రికెట్​ గ్రౌండ్​.
 

దీనిని 1893లో దీన్ని చైల్​ మిలిటరీ స్కూల్లో భాగంగా నిర్మించారు. బ్రిటీష‌ర్ల పాల‌నా కాలంలో ఇది నిర్మించారు. ఈ స్టేడియం సముద్రమట్టానికి 2,444 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే దాదాపు 8వేల 18 అడుగుల ఎత్తులో అన్నమాట. భుపేందర్​ సింగ్​ మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో దీన్ని నిర్మించాడు. ఆ రాజు గొప్ప క్రికెట్​ ప్రేమికుడని చరిత్ర చెబుతోంది. ఈ గ్రౌండ్‌లో ఇటీవ‌లే క్రికెట్ టోర్న‌మెంట్ కూడా నిర్వ‌హించారు. గ‌తంలో ఈ స్టేడియంలో పోలో (గుర్రాలాట‌), బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్ ఆడేవారు.

 

ఇక ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టేడియం విష‌యానికి వ‌స్తే అది గుజరాత్‌లో ఉంది. తాజాగా పున‌ర్ నిర్మించిన అహ్మ‌దాబాద్‌లోని మొతేరా మైదానం ఈ అరుదైన గుర్తింపు ద‌క్కించుకోనుంది. ఈ స్టేడియం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలోనే పెద్ద స్టేడియంగా ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ను ఇది వెనక్కి నెట్టేయనుంది. ఈ స్టేడియాన్ని గ‌తంలో 1982లో నిర్మించ‌గా.. అప్ప‌ట్లో 49 వేల సిట్టింగ్ కెపాసిటీ ఉండేది. 

 

సునీల్ గ‌వాస్కర్‌ ఈ స్టేడియంలోనే టెస్టు‌ క్రికెట్‌లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెండుల్క‌ర్ టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసింది కూడా ఇక్క‌డే. ఇప్పుడు ఈ మైదానం కెపాసిటీ ల‌క్ష‌కు పెంచారు. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మాట్లాడేది ఇక్క‌డే కావ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: