ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఎన్నో రికార్డుల బద్దలు కొట్టి టెస్టు, వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానం లో కొనసాగుతున్న టీమిండియా సారథి కింగ్ కోహ్లీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం న్యూజిలాండ్ పర్యటనలో అతను ఫామ్ కోల్పోవడమే. టీ 20సిరీస్ దగ్గర నుండి వన్డే సిరీస్ లో వరకు కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్నతొలి టెస్టు లో మొదటి ఇన్నింగ్స్ లో 2,రెండో ఇన్నింగ్స్ లో 19పరుగులు చేసి వెనుదిరిగాడు దాంతో హేటర్స్, కోహ్లీ ని ట్రోల్ చేస్తున్నారు. 
 
ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ ఉండాలని కోహ్లీ కంటే రోహిత్ చాలా బెటర్ అని కామెంట్లు పెడుతున్నారు. వీటికి విరాట్ అభిమానులు కూడా దీటుగానే  స్పందిస్తున్నారు. కేవలం ఒక్క టూర్ లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ పనైయిపోయినట్లు కాదని మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతాడని రిప్లై లు ఇస్తున్నారు. ఇక కోహ్లీ అప్పుడెప్పుడో 2015లో  ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు  దాని తర్వాత మళ్ళీ ఇదే.. 
 
ఇదిలావుంటే న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ డ్రా కోసం పోరాడుతుంది. మూడో రోజు అట ముగిసే సమయానికి  టీమిండియా  రెండో ఇన్నింగ్స్ లో 4వికెట్ల నష్టానికి 144పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే మరో 39పరుగులు చేయాలి. ప్రస్తుతం రహానే(25*),విహారి(15*) క్రీజ్ లో వున్నారు. వీరితో పాటు వికెట్ కీపర్ పంత్ పోరాడితేనే ఈ టెస్టు లో భారత్ గట్టెక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: