వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు లో టీమిండియా పై న్యూజిలాండ్ 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 144/4 తో నాలుగో రోజు బ్యాటింగ్ ఆరంభించిన  భారత్ ఆల్ అవుట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. మ్యాచ్ ప్రారంభమైన మూడో ఓవర్ కే రహానే అవుట్ కాగా ఆ తరువాత ఓవర్ లో విహారి వెనుదిరిగాడు. 
 
ఆ కాసేపటికే అశ్విన్ కూడా పెవిలియన్ చేరడం తో మొదటి ఆరు ఓవర్ల లోనే మూడు వికెట్లు కోల్పోగా  ఈక్రమంలో పంత్ ,ఇషాంత్ పోరాడారు. అయితే ఇషాంత్ అవుట్ అయిన నెక్స్ట్ ఓవర్ లోనే పంత్ , బుమ్రా కూడా అవుట్ కావడంతో 191 ల వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం 9పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా రెండు ఓవర్లలో విజయం సాధించింది. 
 
ఈమ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5వికెట్ల తో మొత్తం 9వికెట్లు తీసిన  సౌథీ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. న్యూజిలాండ్ కు ఇది టెస్టుల్లో 100వ విజయం. కాగా  ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో వరుసగా 7విజయాలను సాధించిన  టీమిండియా తాజాగా ఈటెస్టు తో తొలి ఓటమిని చవిచూసింది. ఇక ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 29నుండి జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: