మనిషికి త్రుప్తి ఉండదు. కోరికలు అపరిమితం... అర్ధ శాస్త్రంలో ఏమంటా దీని గురించి రాసారో గాని మన టీం ఇండియా క్రికెట్ అభిమానులను చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళిన టీం ఇండియా టి20 సీరీస్ ని గెలుచుకుంది. సమిష్టి కృషి తో విజయ౦ సాధించింది. ఆ తర్వాత వన్డే సీరీస్ కి కివీస్ పుంజుకుంది బాగా ఆడింది. విజయం సాధించింది సీరీస్ కైవసం చేసుకుంది. 

 

టి20 సీరీస్ ని టీం ఇండియా గెలిచినప్పుడు కొందరు ప్రబుద్దులు మాట్లాడిన మాటలు ఒకసారి చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. పాపం న్యూజిలాండ్ కి కలిసి రాలేదు. లేకపోతే గెలిచే అవకాశాన్ని కూడా ఆ జట్టు కోల్పోవడం ఏంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇక నలుపు ఆ జట్టుకి కలిసి రావడం లేదని జాతకాలు కూడా చెప్పారు. సరే అది పక్కన పెట్టి వన్డే సీరీస్ కి వస్తే మన వాళ్ళు టి20 లో మాత్రమే పులులు అన్నారు. 

 

సరే వన్డే సీరీస్ పోయింది. టెస్ట్ సీరీస్ కి వచ్చారు. టెస్ట్ సీరీస్ లో టీం ఇండియా మొదటి టెస్ట్ దారుణంగా ఓడిపోయింది. జట్టు అన్నాకా గెలుపు ఓటములు సహజం. కోహ్లిని పచ్చి బూతులు తిడుతున్నారు. కోహ్లీ ఆడకపోవడం వలనే ఓడిపోయింది అంటూ మాట్లాడుతున్నారు. అంటే కోహ్లీ ఆడకపోతే మిగిలిన టీం మనుషులు కాదా లేకపోతే వాళ్లకు క్రికెట్ రాదా...? ఎన్ని మ్యాచులు కోహ్లీ ఒంటి చేత్తో గెలిపించాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని సోషల్ మీడియాలో రాయలేని భాషలో మాట్లాడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: