15 నెలల తరువాత ఎట్టకేలకు బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ లో విజయం సాదించింది. తాజాగా సొంత గడ్డ పై జింబాబ్వే తో జరిగిన ఏకైక టెస్టు లో బంగ్లాదేశ్ 106 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. ఈమ్యాచ్ లో జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్ లో 265పరుగులు చేయగా బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ ను 560/6 వద్ద డిక్లర్ చేసింది. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 203 పరుగులతో అజేయంగా నిలువగా కెప్టెన్ మోమినుల్ హాక్ 132 పరుగులు చేశాడు.
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన  జింబాబ్వే 189 పరుగులకు ఆల్ ఔటై ఇన్నింగ్స్ ఓటమి ని చవిచూసింది. బంగ్లా బౌలర్ల లో నయీమ్ హాసన్ 5,తైజుల్ ఇస్లామ్ 4వికెట్లు పడగొట్టారు. ఇక అజేయ డబుల్ సెంచరీ చేసిన ముష్ఫికర్ రహీమ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ముష్ఫికర్ కు ఇది మూడో డబుల్ సెంచరీ.. ఇప్పటివరకు బంగ్లాదేశ్ తరుపున 5డబుల్ సెంచరీలు నమోదు కాగా  అందులో మూడు ముష్ఫికర్ వే కావడం విశేషం. 
 
ఇక బంగ్లా, జింబాబ్వే ల మధ్య మూడు వన్డే ల సిరీస్ మార్చి1 నుండి ప్రారంభం కానుంది కాగా టెస్టు మ్యాచ్ కు దూరమైన జింబాబ్వే రెగ్యులర్ కెప్టెన్  సీన్ విలియమ్సన్ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు. వన్డే సిరీస్ తరువాత ఇరు జట్ల మధ్య రెండు టీ 20ల సిరీస్ కూడా జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: