టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ గత కొంతకాలంగా క్రికెట్కు ఆమడ దూరం ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ప్రపంచకప్ లో  న్యూజిలాండ్ తో  ఓటమి తర్వాత ధోని క్రికెట్ కి దూరం అయిపోయాడు. ఇదిగో వస్తాడు అధిగో  వస్తాడు అని అభిమానులు భావించడమే తప్ప ధోని ఇప్పటివరకు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టింది లేదు. ఇక ఎట్టకేలకు ఎన్నో నెలల తర్వాత... ఐపీఎల్ లో ధోని అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. ధోని రీ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న అభిమానులు  ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు రాబోతుందా అని ఎంతో నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మార్చి 2వ తేదీ నుంచి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు  తెలుస్తోంది. 

 

 

 చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటను తిరిగి ప్రారంభించాడు. ఐపీఎల్  కోసం చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన ఆటగాళ్లు సురేష్ రైనా అంబటి రాయుడు ఇప్పటికే చిదంబరం స్టేడియం కి చేరుకొని గత మూడు వారాలుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఇక వీరిని మార్చి 2న ధోనీ కలిసి ధోనీ కూడా ప్రాక్టీసు మొదలు పెట్టానున్నాడు. రెండు వారాలు కఠిన సాధన చేసిన తర్వాత ధోనీ చిన్న విరామం తీసుకొని అనంతరం మార్చి 19 నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ క్యాంప్ లో పాల్గొంటారని సిఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. ఇక ధోని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చిన అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు. 

 

 

 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై లో  ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ ఎక్కడ ఆడినా ఆ జట్టును ఎంకరేజ్ చేసేందుకు ప్రేక్షకులు భారీ మొత్తంలో స్టేడియాలు కు వెళుతూ ఉంటారు. కేవలం మ్యాచ్ జరుగుతున్నప్పుడే కాదు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా భారీ ఎత్తున అభిమానులు హాజరవుతారు. ప్రస్తుతం సిఎస్కే  ఆటగాళ్లందరూ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ లో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు ఇప్పటికే చిదంబరం స్టేడియం కి చేరుకొని ఆటగాళ్ల ప్రాక్టీస్ ను కూడా వీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధోని టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ మాత్రమే కాదు... ఐపీఎల్లో సత్తా చాటి అక్టోబర్ లో జరగబోయే ప్రపంచ కప్ జట్టులో కూడా స్థానం సంపాదించడం.

మరింత సమాచారం తెలుసుకోండి: