విధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. కొన్ని జీవిత క‌థ‌లు వింటే ఈ సామెత గుర్తుకురాక తప్ప‌దు. ఎంతో ఉన్న‌త స్థాయిలో ఉన్న‌వారు చాలా మంది ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొన్న సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి.  క్రికెట‌ర్ల లైఫ్ ఎంత విలాస‌వంతంగా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రి అందులోనూ ఐపిల్‌లో ఆడి నాలుగు సార్లు లీడ్‌లో ఉన్నాడంటే అత‌ను ఎంత గొప్ప స్థాయిలో ఉండి ఉంటాడో మీ ఊహ‌కే వ‌దిలేస్తున్న విష‌యం ఇది. మ‌రి అలాంటి ప్లేయ‌రే ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ ల్యూక్ పోమ‌ర్స్‌బ్యాక్‌. ఇక అత‌ని ప్ర‌వ‌ర్త‌నే త‌న కెయిర్‌ని నాశ‌నం చేసింది.   

 


2008 నుంచి 2013 మధ్య వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అతను మొత్తం 17 మ్యాచ్‌ల‌లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్లో 302 పరుగులు తీసి ఘ‌న విజయం సాధించాడు.  2008 జరిగిన ఐపీఎల్ లో3 లక్షల డాలర్ల ధరకు ఐపీఎల్ జట్టు కింగ్స్ లెవన్ పంజాబ్ అతనిని కొనుగోలు చేసింది.  అయితే 2011 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్యూక్ ను దక్కించుకుంది. 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు ఆడుతున్న సమయం లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో  జరిగిన మ్యాచ్ సందర్బం గా ఒక అమెరికన్ యువతిని వేధించాడనే ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ల్యూక్ ఆ సీజన్ నుండి మధ్యలోనే వెళ్ళి పోయాడు. తిరిగి మ‌ళ్ళీ 2013లో మరోసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ల్యూక్..ఐపీఎల్లో తన చివరి మ్యాచ్ 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆడాడు. 2014లో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. ఇక ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌లైంది. క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేయడంతో చెబు వ్య‌స‌నాల‌కు బాగా బానిస‌గా మారిపోయాడు. 

 

దీంతో ఇటీవ‌లె జ‌న‌రిలో జ‌రిగిన రెండు ఘటనల్లో  అత‌గాడు నిందితుడిగా ఉండటంతో బుధవారం కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. బార్ లో గొడవ, బైక్ దొంగతనం ఇలా ఒకటేమీ నిత్యం సమస్యలతో  సహవాసం చేస్తూ వ‌స్తున్నాడు. ఆ వివాదాలు  ఎంతలా అంటే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి రోడ్డున పడ్డాడు. కనీసం నిలువ నీడ లేకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక‌ కారు డిక్కీలోనే తలదాచుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే... తాజాగా  ల్యూక్ మరో సారి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. మ‌రి ఇంత చెడు వ్య‌సనాల‌కి అల‌వాటు ప‌డ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు ఏంట‌న్న‌ది మాత్రం తెలియ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: