టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ముందు ఓ అరుదైన రికార్డు వుంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే మరో మూడు వికెట్లు తీస్తే చాలు ఇషాంత్ టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరనున్నాడు. తద్వారా భారత్ తరుపున ఈ ఘనత సాధించిన మూడో పేస్ బౌలర్ గా ఇషాంత్ రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకుముందు ఈ ఘనత ను లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సాధించారు. కపిల్ దేవ్ టెస్టుల్లో మొత్తం 434 వికెట్లు తీయగా జహీర్ ఖాన్ 311 వికెట్లను తీసుకున్నాడు. మరి ఈనెల 29నుండి న్యూజిలాండ్ తో ప్రారంభం కానున్నరెండో టెస్టు లో 300వికెట్ల క్లబ్ లో చేరి ఇషాంత్,వీరి తర్వాతి స్థానం లో నిలుస్తాడో లేదో చూడాలి.  
 
ఇదిలావుంటే కివీస్ తో టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉంటాడో లేదో అనుకుంటే ఫిట్ నెస్ సాధించి జట్టులో చోటు సంపాదించుకున్నఇషాంత్ మొదటి టెస్టు లో సత్తా చాటి తన విలువెంటో చాటి చెప్పాడు. సహచరులు షమి, బుమ్రా విఫలమైనా.. 5వికెట్లు తీసి ఇషాంత్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక మొదటి టెస్టులో చిత్తుగా ఓడిపోయిన భారత్.. రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను డ్రా చేసుకోవాలని భావిస్తుంది. అందుకోసం ఈటెస్టులో  రెండు లేదా మూడు మార్పులతో బరిలోకి దిగనుంది. మరోవైపు మొదటి టెస్టు ను మూడున్నర రోజుల్లోనే  ముగించి  సునాయాస విజయం సాధించిన న్యూజిలాండ్  రెండో టెస్టు లో కూడా అదే ప్రదర్శన కనబర్చి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: