కొలొంబో వేదికగా బుధవారం వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే లో శ్రీలంక రికార్డు సృష్టించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. అయితే ఇంత భారీ స్కోర్ చేసినా  ఒక్క సిక్స్ కూడా నమోదు కాకపోవడం విశేషం.  తద్వారా వన్డే ల్లో సిక్స్ లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టు గా శ్రీలంక రికార్డు సృష్టించింది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో(127), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ కుశాల్ మెండిస్ (119) సెంచరీల తో రాణించడంతో లంక భారీ స్కోర్ చేసింది. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 39.1 ఓవర్లలో 184పరుగులకే ఆల్ ఔటై పరాజయాన్నిచవిచూసింది. ఓపెనర్ షై హోప్ (51) ఒక్కడే రాణించాడు.  శ్రీలంక బౌలర్ల లో హాసరంగా 3,సందకన్ 3,ప్రదీప్ 2 వికెట్లు తీయగా ఏంజెలో మాథ్యూస్‌ ఓ వికెట్ పడగొట్టాడు. సెంచరీ హీరో అవిష్క ఫెర్నాండో కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ  విజయం తో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తోశ్రీలంక కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరుగనుంది. ఈ పర్యటనలో లంక తో వెస్టిండీస్ రెండు టీ 20ల సిరీస్ ను కూడా ఆడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: