ప్రస్తుతం సౌతాఫ్రికా టీంకు కెప్టెన్ డికాక్ పెద్ద దిక్కుగా మారాడు. మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ఫామ్ కోల్పోవడం మిల్లర్ లాంటి అనుభవజ్ఞుడున్నా పెద్దగా ఉపయోగపడక పోవడంతో డికాక్ ఒక్కడే ఆదుకోవాల్సివస్తుంది. సౌతాఫ్రికా మ్యాచ్ గెలువాలంటే అందులో డికాక్ పాత్ర తప్పనిసరి. గత కొన్ని సిరీస్ లనుండి ఇదే సీన్ రిపీట్ అవుతుంది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో కూడా ఇదే పునరావృతం అయ్యింది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా 89పరుగులకే ఆల్ ఔటై చిత్తుగా ఓడిపోయింది. ఈమ్యాచ్ లో డికాక్ 2పరుగులే చేశాడు. రెండో టీ 20లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 70 పరుగులతో డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలుపులో కిలక పాత్ర పోషించాడు.  
 
 
ఇక నిన్న జరిగిన మూడో టీ 20 లో డికాక్ 5 పరుగులే చేసి వెనుదిరిగాడు ఫలితంగా ఈమ్యాచ్ లో సఫారీలు 96 పరుగులకే ఆల్ ఔటై ఓటమిని చవిచూసారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20ఓవర్ల లో 5వికెట్ల నష్టానికి 193పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దారుణంగా విఫలమై 97 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయం తో ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఈనెల 29నుండి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇదిలావుంటే ఆసీస్ తో వన్డే సిరీస్ ముగిసాక సౌతాఫ్రికా,టీమిండియాతో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ కోసం త్వరలో భారత్ , దక్షిణాఫ్రికా రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: