ఐపీఎల్ వచ్చిందంటే భారత్లో క్రికెట్ సందడి డబుల్  అవుతుంది అన్న విషయం తెలిసిందే. మామూలు మ్యాచ్ లప్పుడు  ఎలా ఉన్న  ఐపీఎల్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఇక తన ఫేవరెట్ జట్టు ఆడుతున్నది అంటే మాత్రం ఆ సందడి మరింత పెరిగిపోతోంది. అప్పుడు వరకు కలిసి ఆడిన ఆటగాళ్ళందరూ ఐపీఎల్ ల్లో  ప్రత్యర్థులుగా మారిపోయి హోరా హోరీగా పోటీ పడుతూ ఉంటారు. టైటిల్ గెలిసేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం టీమిండియా లోని ప్రతి ఒక ఆటగాడు తమదైన వ్యూహాలతో  జట్టును ముందుకు నడిపిస్తూ.. టైటిల్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అందుకే ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రేక్షకులందరికీ పండగే అని చెప్పాలి. 

 

 

 అయితే తెలుగు ప్రజలందరికీ ఫేవరెట్ జట్టు ఏది అంటే టక్కున గుర్తొచ్చే పేరు సన్రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ అనతి కాలంలోనే ఎంతో ప్రతిభ చాటి  ఎంతో క్రేజ్ ని సంపాదించింది. అప్పటివరకు తెర మీద ఎక్కడా కనిపించని సన్రైజర్స్ జట్టు.. ఏకంగా ఒక సారి ఐపీఎల్ టీం గెలిచింది. జట్టు సమిష్టి కృషితో విజయం పొందవచ్చు అనే పదానికి అసలైన ఉదాహరణ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ జట్టు లోని  ప్రతి ఒక ఆటగాడు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. 

 

 

 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. 2015 నుంచి 2017 వరకు జట్టుకు కెప్టెన్ గా  వ్యవహరించి  ముందుండి నడిపించి  ఒక సారి ఏకంగా ఐపీఎల్ టైటిల్ ని సైతం సొంతం  చేసుకునేలా చేసిన వార్నర్ మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా మారిపోయాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో రెండేళ్లపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్... మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టినట్లు సన్రైజర్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. తనను రెండోసారి కెప్టెన్ ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: