ఈ ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ను మార్చేసింది. కేన్ విలియమ్సన్ స్థానంలో విధ్వసంక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను సారథిగా నియమిస్తున్నామని సన్ రైజర్స్ యాజమాన్యం కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. బాల్ ట్యాపరింగ్ వ్యవహారంతో 2018 ఐపీఎల్ సీజన్ కు దూరమైన వార్నర్ గత సీజన్ లో రాణించి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్ లో వార్నర్ 12మ్యాచ్ ల్లో 69.20 సగటు తో 692 పరుగులు చేశాడు. ఆ ఒక్క సీజన్ లో నే కాదు దాదాపు ప్రతి సీజన్ లో అతను సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్ లో 126మ్యాచ్ లు ఆడిన వార్నర్ 43.17 సగటు తో 4706 పరుగులు చేశాడు.   
 
 
ఇక ఈసీజన్ కు కూడా విలియమ్సనే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని అనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది సన్ రైజర్స్. మరి వార్నర్ నేతృత్వం లో సన్ రైజర్స్ మరో సారి ట్రోఫీని ఎగరేసుకుపోతుందో చూడాలి. ఇక  ఇటీవల జరిగిన వేలం లో మరికొంత మంది ప్లేయర్లను దక్కించుకోవడంతో 13సీజన్ కు ముందు  హైదరాబాద్ జట్టు దుర్బేధ్యంగా కనిపిస్తుంది. 
 
సన్ రైజర్స్ హైదరాబాద్
 
డేవిడ్ వార్నర్ (కెప్టెన్),బెయిర్ స్టో (కీపర్), విలియమ్సన్, సాహా , మనీష్ పాండే , విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ , నబి, అభిషేక్ శర్మ , ప్రియమ్ గార్గ్ , సందీప్ శర్మ , ఖలీల్ అహ్మద్ , సిద్దార్థ్ కౌల్, నదీమ్ , మిచెల్ మార్ష్ , బాసిల్ తంపి, సందీప్ భవనాక , సంజయ్ యాదవ్ , బిల్లీ స్టాన్ లేక్ ,అబ్దుల్ సమద్ ,శ్రీవత్స గోస్వామి, ఫాబియన్ అలెన్ , విరాట్ సింగ్ , నటరాజన్

మరింత సమాచారం తెలుసుకోండి: