న్యూజిలాండ్ తో రెండో టెస్టు కు ముందు  టీమిండియా కు ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా  సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండో టెస్టు కు దూరమయ్యాడు. ఇటీవల రంజీ మ్యాచ్ లోనే ఈ గాయం చేసుకున్న ఇషాంత్ ఆ తరువాత కోలుకొని  జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ టెస్ట్ పాస్ కావడంతో కివీస్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైయ్యాడు. దాంతో మొదటి మ్యాచ్ లో స్థానం సంపాదించిన ఇషాంత్.. 5వికెట్లు తీసి సత్తా చాటాడు.
 
అయితే రెండో టెస్టు కు ముందు ప్రాక్టీస్ సెషన్ లో ఆ గాయం మళ్ళీ తిరగబెట్టడంతో ఇషాంత్ మ్యాచ్ కు దూరం కావాల్సివచ్చింది. అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే మొదటి టెస్టులో చిత్తుగా ఓడిపోయి సిరీస్ ను గెలిచే అవకాశం కోల్పోయిన భారత్ కు తాజాగా ఇషాంత్ రూపంలో మరో దెబ్బ తగిలింది. శనివారం నుండి ఇరు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 
తుది జట్లు (అంచనా ): 
 
భారత్ : పృథ్వీ షా ,మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్) , పుజారా, రహానే, పంత్ /సాహా(కీపర్),హనుమ విహారి, రవీంద్ర జడేజా /అశ్విన్ , బుమ్రా, షమీ, ఉమేష్ యాదవ్ 
 
న్యూజిలాండ్ : టామ్ లేథమ్ ,టామ్ బ్లండెల్, విలియమ్సన్(కెప్టెన్), టేలర్ , వాట్లింగ్ (కీపర్) , గ్రాండ్ హోమ్, నికోల్స్, వాగ్నెర్, సౌథీ, బౌల్ట్, జమైసన్

మరింత సమాచారం తెలుసుకోండి: