ఈఏడాది సెప్టెంబర్ లో జరుగనున్న ఆసియా కప్ వేదిక మారింది. పాకిస్థాన్ ఈ టోర్నీ నిర్వాహణ హక్కులు పొందింది అయితే టీమిండియా ను భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు దాంతో ఆసియా కప్ ను దుబాయ్ లో నిర్వహించడానికి పాకిస్థాన్ ఓకే చెప్పింది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ వార్తలను ధ్రువీకరించాడు. వచ్చే నెల 3న జరిగే  ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లే ముందు గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ఆసియా కప్ దుబాయ్ లో జరుగనుంది ఈ టోర్నీ లో భారత్ , పాకిస్థాన్ లు కూడా పాల్గొంటాయని  గంగూలీ వెల్లడించాడు. 

 
అలాగే  టీ 20ప్రపంచ కప్ లో వరుస విజయాలతో సెమిస్ కు వెళ్లిన భారత మహిళా జట్టు పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు అద్భుతంగా ఆడుతుంది. ప్రపంచ కప్ లో ఎవరు ఫేవరేట్ కాదు వారు ఈ టోర్నీ ని ఎలా ముగిస్తారో చూడాలని దాదా అన్నాడు.  ఇక పనిలో పనిగా న్యూజిలాండ్ పై వరుస ఓటములను చవి చూస్తున్న టీమిండియా పురుషల జట్టు పై కూడా గంగూలీ  స్పందించాడు. ఇంకా పర్యటన ముగియలేదు .. రెండో టెస్టు లో భారత్ జట్టు పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నేటి నుండి టీమిండియా, న్యూజిలాండ్ ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా  రెండో టెస్టు ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: