ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్ లో వైట్ వాష్ కాగా మొదటి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే టీమిండియా యొక్క సామర్థ్యం గురించి తెలిసిన ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని తర్వాత భారత్ కచ్చితంగా పుంజుకుంటుందని కచ్చితంగా నమ్ముతూనే ఉంటాడు. ఎంతైనా కొంచెం నిరాశలో ఉన్న అభిమానులకు ఇటువంటి పరిస్థితుల్లో బాగా ఆనందపరిచే విషయం ఏమిటంటే త్వరలోనే భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. భారత్-పాక్ పోరు కోసం ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంది. అయితే ఇక్కడ భారత క్రికెట్ బోర్డు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పైన పట్టుదలతో తన పంతం నెగ్గించుకున్న విషయం గురించి చర్చించుకోవాలిసిందే.

 

IHG

 

పాకిస్తాన్ లో ఉగ్రవాదుల ముప్పు ఉందని తెలిసినప్పటి నుండి చాలా ఏళ్ళ పాటు దేశం కుడా అక్కడికి క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. ఒక సారి క్రికటర్లపై అక్కడ దాడి జరగడమే అందుకు కారణం. అయితే చాలా సంవత్సరాల తర్వాత శ్రీలంక ఇప్పుడు అంతా సవ్యంగానే ఉందని తెలిసిన తర్వాత మధ్యనే అక్కడ పర్యటించింది. అయితే ఎప్పటినుంచో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టీమిండియా వారితో కనీసం ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి కూడా సముఖత చూపించలేదు. అయితే ఐసిసి టోర్నమెంట్లు మరియు ఆసియా కప్ వరకు మాత్రం భారత్-పాక్ మ్యాచ్ లు యధావిధిగా జరుగుతాయి.

 

IHG

 

సారి ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుండగా భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ లో అడుగుపెట్టే అవకాశమే లేదని మొదటి నుంచి బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెబుతూనే ఉన్నాడు. అయినా పట్టు వదలకుండా భారతి ఎలాగైనా ఇక్కడికి రావాలని పాక్ బోర్డు ప్రయత్నిస్తూ ఉండగా చివరికి బిసిసిఐ తన పంతం నెగ్గించుకున్నారు. భారత్ ఆసియా కప్ లో ఆడబోయే అన్నీ మ్యాచ్ లను దుబాయ్ లో ఉండబోతున్నాయి అని సౌరవ్ గంగూలీ నేడు తెలిపాడు. కాబట్టి పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ లతో జరగనున్న పోరులన్నింటినీ భారత్ దుబాయ్ లోనే తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: