హమ్మయ్య రెండో టెస్ట్ లో టీం ఇండియా నిలబడింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తొలుత తడబడిన కోహ్లీ సేన ఆ తర్వాత నిలకడగా ఆడుతుంది. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయిన టీం ఇండియా ఆ తర్వాత పుజారా, ఓపెనర్ పృథ్వీ షా ఆట తీరుతో కోలుకుంది. ఈ క్రమంలో షా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని కాస్త దూకుడుగా ఉండగా జేమిసన్ బౌలింగ్ లో లాథం కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

 

ఆ వెంటనే వచ్చిన కోహ్లీ 3 పరుగులు, రహానే 7 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హనుమ విహారి తో కలిసి పుజారా ఇన్నింగ్స్ ని నిర్మించాడు. ఆచితూచి ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం దాదాపుగా 110 బంతులు తీసుకున్నాడు. ఎక్కడా కూడా తడబడకుండా కంగారు పడకుండా తన జిడ్డు ఆట తీరుతో న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పుజారా. 

 

అటు హనుమ విహారీ కూడా ఓపికగా ఆడుతున్నాడు. అప్పుడో ఫోర్ అప్పుడో ఫోర్ కొడుతూ ఇన్నింగ్స్ ని నిర్మించారు. ప్రస్తుతం 41 ఓవర్లకు టీం ఇండియా 148 పరుగులు చేసింది. కాగా తొలి టెస్ట్ టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలవకపోతే మాత్రం సీరీస్ కోల్పోయే అవకాశాలు స్పష్ట౦గా ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ బౌలింగ్, బ్యాటింగ్ బలంగా ఉన్న నేపధ్యంలో కనీసం  300 పై చిలుకు పరుగులు చెయ్యాలి టీ౦ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: